Soundarya : గత రెండు మూడు రోజులుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ పేర్లే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, మన ఎలక్ట్రానిక్ మీడియా వాటి అన్నిటిని పక్కన పెట్టి 24 గంటలు ఈ కుటుంబం లో జరుగుతున్న వివాదాల గురించి లైవ్ కవరేజ్ ఇచ్చింది. ఈ క్రమంలో మోహన్ బాబు కోపం లో అదుపు తప్పి ఒక ప్రముఖ మీడియా ఛానల్ రిపోర్టర్ ని బూతులు తిడుతూ, అతని ముఖం పై మైక్ తో కొట్టడం పెద్ద సంచలనం గా మారింది. జర్నలిస్టు సంఘాలు మోహన్ బాబు తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేసింది. మంచు మనోజ్, మంచు విష్ణు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి మీడియా కి క్షమాపణలు కూడా చెప్పారు. మరోపక్క ఈ ఘర్షణలో మోహన్ బాబు కి కూడా స్వల్పంగా గాయాలు అవ్వడంతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ కి తరలించారు.
ఇదంతా పక్కన పెడితే ఈ ఆస్తికి ప్రముఖ హీరోయిన్, దివంగత సౌందర్య కి సంబంధం ఏమిటి అని సోషల్ మీడియా లో ఇప్పుడు అభిరామానుల్లో తలెత్తిన ప్రశ్న. పూర్తి వివరాల్లోకి వెళ్తే మోహన్ బాబు ప్రస్తుతం తన భార్య నిర్మలా దేవితో కలిసి హైదరాబాద్ లోని శంషాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి జల్ పల్లి లో ఉండే నివాసం లో ఉంటున్నాడు. విష్ణు ఇటీవలే దుబాయి లో తన కుటుంబం తో స్థిరపడగా, మనోజ్ కుటుంబం మాత్రం ఇక్కడే ఉంటున్నారు. అయితే ఒకప్పుడు ఈ స్థలం, బంగ్లా ప్రముఖ హీరోయిన్ సౌందర్య కి సంబంధించినది అట. ఆమె హీరోయిన్ ఒక వెలుగు వెలుగుతున్న రోజుల్లో ఎంతో ఇష్టపడి ఈ స్థలాన్ని కొనుగోలు చేసి, అక్కడ ఒక బంగ్లా కట్టుకుందట.
ఆమె చనిపోయిన తర్వాత తల్లుతండ్రులు ఈ ప్రాపర్టీ ని మోహన్ బాబు కి తక్కువ రేటుకే అమ్మేసారట. ఆ తర్వాత మోహన్ బాబు ఈ బంగ్లా కి కొన్ని మార్పులు చేర్పులు చేసి, ఇంకా పెద్దగా నిర్మించి, తన భార్యతో కలిసి ఇక్కడే గత కొన్నేళ్ల నుండి నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాపర్టీ కోసమే మంచు మనోజ్ పోరాడుతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం చూస్తే ఈ ప్రాపర్టీ 100 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని సమాచారం. ఇది ఇలా ఉండగా నిన్న మొన్నటి వరకు ఈ వివాదంలో ఫుల్ బిజీ గా గడిపిన మంచు మనోజ్, ఈరోజు షూటింగ్ కి వెళ్ళాడట. ప్రస్తుతం ఆయన ‘మిరాయ్’, ‘భైరవం’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించి ఆయన ఫస్ట్ లుక్స్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు హీరోగా మరో మూడు సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్నాడు.