Animal: ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు యానిమల్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన కలిసి నటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1న విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే తెలుగులో కూడా యానిమల్ సినిమ హవా నడుస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా ఆ ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో యానిమల్ సినిమా కోసం టాలీవుడ్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందని మూవీ మేకర్స్ మాత్రమే కాదు ట్రైలర్ చూసిన ప్రేక్షకులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అవడానికి మరొక మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో సినిమా టీమ్ ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచేసింది.
ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే తెలుగు సినిమాలకు ఇబ్బంది అవుతుంది కావచ్చనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే డిసెంబర్ 6న ప్రీమియర్ లతో విడుదల అవుతోంది హీరో నాని సినిమా. అలాగే డిసెంబర్ 8న నితిన్ నటించిన ఎక్ట్రార్డినరీ మాన్ సినిమా కూడా విడుదల కానుంది. ఈ రెండు సినిమాల్లో ఒకటి క్లాస్ టచ్ ఎమోషనల్ సినిమా. రెండవది పక్కా రొటీన్ మాస్ కమర్షియల్. అందువల్ల యానిమల్ సెన్సేషనల్ రేంజ్ లో జనాలను ఆకట్టుకోకుంటే మాత్రం ఈ తెలుగు సినిమాలు ఇబ్బంది పడడం ఖాయం అనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
నాని అదే విధంగా నితిన్ సినిమాలు యానిమల్ సినిమా ఫలితాలపై డిపెండ్ అయి ఉంటాయి. ఒకవేళ యానిమల్ సినిమా కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయితే పరిస్థితి సెన్సేషన్ గా ఉంటుందనే చెప్పాలి. మరి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నితిన్, నాని మూవీ మేకర్స్ విడుదల తేదీని వాయిదా వేస్తారా లేదా చూడాలి..