Lavanya Tripathi: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ జంట ఈ మధ్యనే పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న ఈ జంట హైదరాబాద్ లో రిసెప్షన్ చేసుకున్నారు. ఈ పార్టీకి సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులు వచ్చారు. ఇక అందాల రాక్షసిగా కుర్రకారు మనసు దోచేసిన ఈ బ్యూటీ.. మెగా కుటుంబంలో అడుగుపెట్టింది. అయితే పెళ్లి తర్వాత ఎలా ఉంటున్నారని తెలుసుకోవడం అభిమానులకు ఆసక్తిగా ఉంటుంది.
పెళ్లి తర్వాత నుంచి సంప్రదాయంగా ఉన్న ఈ అమ్మడు రీసెంట్ గా ప్రొఫెషన్ కు తగ్గట్టుగా ఓ ఫోటో షూట్ చేసి మరీ అందరినీ అట్రాక్ట్ చేసింది. స్లీవ్ లెస్ మోడ్రన్ దుస్తుల్లో కనిపించి కుర్రకారును ఫిదా చేసింది. పెళ్లి తర్వాత ఆమె ఇలా కనిపించడంతో నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టడంతో ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతోందట. మెగా కోడలయ్యాక ఫ్యాన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని సినిమా ఆఫర్స్ ఒకే చేయాలి. పెద్దింటి కోడలిగా ఫ్యాన్స్ ని నొప్పించే ఏ పని చేసినా అది పెద్ద రచ్చ అయ్యే ప్రమాదం ఉందని భావిస్తోందట.
మెగా ఇంట్లోకి వచ్చిన కొత్త కోడలు లావణ్యకు సంబంధించిన ఆస్తి వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లావణ్య త్రిపాఠి పర్సనల్ ఎంత ఆస్తి సంపాదించింది. అలాగే ఆమె ఫ్యామిలీ కి ఎంత ఆస్తి ఉంది అనే విషయాలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూనే లావణ్య త్రిపాఠి సుమారు రూ. 20 కోట్ల విలువ చేసే ఆస్తులను కూడబెట్టిందని టాక్. అంతేకాదు నార్త్ ఇండియా ఫ్యామిలీకి చెందిన ఈ అమ్మడికి మంచి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉందట. లావణ్యకు తన ఫ్యామిలీ నుంచి వచ్చే ఆస్తి, పూర్వికుల నుంచి వచ్చే అసెట్స్ కూడా చాలా ఉన్నాయని టాక్. తండ్రి, తాతల నుంచి భారీగా ఆస్తులు వస్తాయట.
మెగా ఫ్యామిలీకి ఏ మాత్రం తక్కువ కాకుండా ఆమె ఆస్తులు ఉన్నట్లు టాక్ వస్తుంది. నిజానికి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరిపై ఎన్నో లవ్ రూమర్స్ వచ్చాయి. కానీ స్నేహితులమని చెబుతూ తర్వాత పెళ్లంటూ ఆశ్చర్యపరిచారు. మొత్తం మీద ఇద్దరు ఒకటై సంతోషంగా ఉన్నారు. అయితే లావణ్య కూడా మెగా ఫ్యామిలీలో సంప్రదాయంగా ఉండాలని కోరుకునే వారే ఎక్కువ. ఉపాసన మాదిరి పేరు సంపాదించాలనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. మరి ఈమె ఏం చేస్తుందో చూడాలి.
View this post on Instagram