వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా భిన్నంగా ఓ వెబ్ సిరీస్‌ను, స్పార్క్ ఓటీటీ సంస్థతో కలిసి తెరకెక్కిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఆడియో పోస్టర్‌ను ఇవాళ విడుదల చేశాడు. ఈ సిరీస్‌కు ‘ఇది మహాభారతం కాదు’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఎంచుకోవడం విశేషం. ఇక ఈ సిరీస్ కి రచన సిరాశ్రీ కాగా, ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించబోతున్నాడు.
Also Read: రోజు పొద్దున్నే భర్తతో అలా చేస్తానంటున్న కాజల్
ఈ సిరీస్ కు పర్యవేక్షణగా వర్మ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక మహాభారతంలోని పాత్రలను ప్రస్తావిస్తూ.. తన వాయిస్ ఓవర్‌తో రాంగోపాల్ వర్మ విడుదల చేసిన ఆడియో పోస్టర్ వీడియో ఆసక్తికరంగా ఉంది. మహాభారతంలో కనిపించే పాత్రలు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట తారసపడుతుంటాయని, తెలంగాణలోని ఓ పట్టణంలోనూ అలాంటి వ్యక్తులు ఉన్నారని తెలుస్తోంది.
Also Read: ఆ వీరుడి కథతో మహేష్ బాబు.. రాజమౌళి సినిమా
ఇక దీని ఆధారంగా తాము వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నామని వర్మ ఆ ఆడియో పోస్టర్ లో వెల్లడించారు. అయితే ‘ఇది మహాభారతం కాదు’ అని నొక్కి మరీ చెప్పారు. అంతేకాదు, అందులో వినిపించే గొంతుక తనది కాదని, మహాభారతం సమయంలో భగవద్గీత వినిపించిన వ్యక్తే తన గొంతుకను అనుకరించాడని వర్మ వ్యాఖ్యానించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్