ఈ ప్రపంచంలో మనిషి పుట్టిన తర్వాత మరణం తప్పకుండా సంభవిస్తుంది. ఈ సృష్టిలో తన ప్రమేయం లేకుండా తన జీవితంలో జరిగే రెండు కార్యాలు జననం, మరణం అని చెప్పవచ్చు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తనకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. చనిపోయిన తర్వాత కూడా ఎన్నో సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం మనకు తెలిసిన విషయమే. అంత్యక్రియలు నిర్వహించేటప్పుడు మనం చనిపోయిన వ్యక్తి చుట్టూ కుండలో నీరు తీసుకుని, ఆ కుండకు రంధ్రాలు వేసి చివరగా పగలగొట్టడం చూస్తుంటాము. ఆ విధంగా అంత్యక్రియలలో కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి ఎందుకు పగల కొడతారు అనే విషయాలు చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే ఆ విధంగా ఎందుకు చేస్తారు ఇక్కడ తెలుసుకుందాం…
Also Read: వెడ్డింగ్ కార్డ్ పై క్యూఆర్ కోడ్.. చదివింపులు నేరుగా ఖాతాలోకి..?
సాధారణంగా మనిషి మరణం అనేది రెండు రకాలుగా జరుగుతుంది. ఒక్కటి సహజ మరణం. ఈ మరణం పొందిన వారు వారి శరీరం నుంచి ఆత్మ దైవ సన్నిధికి చేరుతుందని నమ్ముతుంటారు. ఇంకొకటి అసహజమరణం. ఈ మరణం ప్రమాదవశాత్తు జరగడం లేదా ఆత్మహత్య చేసుకోవడం ద్వారా అసహజమరణం పొందుతారు.ఇలాంటి మరణం పొందిన వారు వారి ఆత్మ తిరిగి శరీరంలోకి ప్రవేశించాలని, తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తుంటుంది.
Also Read: శివుని దర్శించుకునే సమయంలో పాటించాల్సిన నియమాలు.!
ఆ విధంగా చనిపోయిన తర్వాత ఆత్మ తిరిగి మనకు కనిపించకూడదని ఉద్దేశంతో అంత్యక్రియల్లో కొన్ని ఆచారాలను పాటిస్తుంటారు. కొందరు అంత్యక్రియలకు వెళ్లే సమయంలో బోరుగులని,రాగులని చల్లుతూ వెళ్తారు. ఒకవేళ ఆత్మ మనదగ్గరకు చేరుకోవాలంటే వాటన్నింటిని సూర్యోదయం అయ్యేలోపు ఏరుకొని రావాలి లేదంటే మరి మొదటి నుంచి వాటిని ఏరుకొని రావాలి.అందుకోసమే ఆత్మ మన దరిచేరకుండా అంత్యక్రియలు అప్పుడు ఇలాంటివి వేస్తుంటారు. అదేవిధంగా అంత్యక్రియలు చేసేటప్పుడు కుండలో నీళ్లు తీసుకుంటారు. కుండ మన శరీరంతో భావిస్తారు. అందులో ఉన్న నీరు మన ఆత్మగా చెబుతారు. చనిపోయిన తర్వాత ఎలాగైతే మన శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్తుందో ఆ కుండ నుంచి నీరు బయటకు వెళతాయి అని అర్థం. ఇక చివరగా కుండను బద్దలు కొడతారు అంటే మన శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్ళినప్పుడు శరీరాన్ని దహనం చేయడం అని అర్థం.ఈ విధంగా చనిపోయిన తర్వాత అంత్యక్రియలు కుండలో నీరు పోసి బద్దలు కొట్టడం వెనుక ఉన్న ఆచారం.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం