Homeఎంటర్టైన్మెంట్IBomma Ravi Released: జైలు నుండి విడుదలైన 'iBomma' రవి..చుట్టుముట్టిన మీడియా రిపోర్టర్స్..వీడియో వైరల్!

IBomma Ravi Released: జైలు నుండి విడుదలైన ‘iBomma’ రవి..చుట్టుముట్టిన మీడియా రిపోర్టర్స్..వీడియో వైరల్!

IBomma Ravi Released: సినీ ఇండస్ట్రీ ని పైరసీ తో వణుకుపుట్టించిన ‘iBomma’ రవి కొంత కాలం క్రితం అరెస్ట్ అయ్యి, అనేక విచారణలు ఎదురుకొని , నిన్న ఈయన బెయిల్ మీద విడుదల అవ్వడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. విడుదలైన ప్రతీ సినిమాను HD క్వాలిటీ తో ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయడమే కాకుండా, అప్పట్లో దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ పోలీసులకు సవాలు కూడా విసిరాడు. అయితే అతను ఈమధ్య కాలం లో తన భార్య తో విబేధాలు పెట్టుకోవడం, అది విడాకుల వరకు వ్యవహారం రావడం తో, ఆమె హైదరాబాద్ కి వచ్చి రవి చరిత్ర మొత్తం పోలీసుల వద్ద పెట్టింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. పైరసీ ద్వారా రవి కోట్ల రూపాయిలు సంపాదించాడట, దొరికినంత వరకు పోలీసులు సీజ్ చేశారు.

ఇకపోతే నిన్న ‘iBomma’ రవి బెయిల్ మీద విడుదలై బయటకు వస్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన బయటకు రాగానే మీడియా బెల్లం చుట్టును ఈగలు వాలినట్టు, ఒక్కసారిగా అందరూ రవి ని చుట్టుముట్టేశారు. పోలీసులు వారి నుండి రవి ని కాపాడి , జాగ్రత్తగా కారు ఎక్కించి ఇంటికి పంపించారు. ఈ వీడియో ని మీరు ఇప్పుడు క్రింద చూడొచ్చు. ఒక స్టార్ హీరో , లేదా స్టార్ హీరోయిన్ బయటకు వస్తే మీడియా ఎలా అయితే వాళ్ళని చుట్టుముడుతుందో, అంతకంటే ఎక్కువగా రవి ని చుట్టముట్టడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి స్కామ్స్ చేసే వాళ్లపై జనాల్లో కోపం ఉండాలి. కనిపిస్తే రాళ్లతో కొట్టేంత కసి ఉండాలి. రవి పై సినీ ఇండస్ట్రీ లో ఉన్న హీరోలకు, దర్శక నిర్మాతలకు ఆ రేంజ్ కసి ఉంది, కానీ జనాల్లో మాత్రం రవి కి మామూలు క్రేజ్ లేదు.

నిర్మాతలు సినిమా టికెట్ రేట్స్ ఇష్టమొచ్చినట్టు 450 రూపాయిలు, 500 అంటూ పెంచేసి జనాల డబ్బుని లూటీ చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్న ఈ కాలంలో రవి మాకు ఉచితంగా సినిమాని చూపించే ప్రయత్నం చేశాడంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతను జనాలకు చాలా వరకు డబ్బులు ఆదా చేసాడు, అతను కూడా లాభం పొందాడు, ఇందులో అతన్ని ద్వేషించడానికి ఆస్కారం ఎక్కడ ఉందంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే రవి ని పట్టుకుంటే మొత్తం పైరసీ సామ్రాజ్యం మొత్తం కూలిపోతుందని చాలామంది భ్రమపడ్డారు. కానీ అలాంటిదేమి జరగలేదు, ఇప్పటికీ పైరసీ జరుగుతూనే ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version