https://oktelugu.com/

Sreeleela: పబ్లిక్ గా అతనికి ముద్దులు పెట్టి ‘ఐ లవ్ యూ’ చెప్పిన శ్రీలీల..మొత్తానికి ప్రేమ వ్యవహారం బయటపడింది!

కేవలం శ్రీలీల డ్యాన్స్ వల్లే ఈ సినిమా హిట్ అయ్యింది అంటూ రివ్యూస్ లో కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఈమెకు వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి కానీ, క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఈ అమ్మాయికి కేవలం డ్యాన్స్ మాత్రమే వచ్చు, యాక్టింగ్ రాదు వంటి విమర్శలు కూడా వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : September 20, 2024 / 03:23 PM IST

    Sreeleela

    Follow us on

    Sreeleela: కొంతమంది హీరోయిన్స్ చూడగానే ప్రేక్షకులకు నచ్చేస్తారు. కేవలం ఆ హీరోయిన్ కోసమే ప్రేక్షకులను థియేటర్స్ కే క్యూలు కట్టించేలా చేస్తారు. ఇలాంటి అదృష్టం అందరి హీరోయిన్స్ కి రాదు, వంద మందిలో కేవలం ఒకరిద్దరికి మాత్రమే వస్తుంది. వారిలో ఒకరు శ్రీలీల అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ టాలీవుడ్ కి పరిచయం అవుతూ తెరకెక్కిన ‘పెళ్లి సందడి’ అనే చిత్రం ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది శ్రీలీల. ఆ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చింది, అయినప్పటికీ కూడా ప్రోమోస్ లో శ్రీలీల అద్భుతమైన డ్యాన్స్ ని చూసి, థియేటర్స్ కి కదిలారు ఆడియన్స్. ఫలితంగా ఆ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘ధమాకా’ చిత్రం ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

    కేవలం శ్రీలీల డ్యాన్స్ వల్లే ఈ సినిమా హిట్ అయ్యింది అంటూ రివ్యూస్ లో కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఈమెకు వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి కానీ, క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఈ అమ్మాయికి కేవలం డ్యాన్స్ మాత్రమే వచ్చు, యాక్టింగ్ రాదు వంటి విమర్శలు కూడా వచ్చాయి. అలాంటి విమర్శలకు ఆమె చెక్ పెడుతూ ‘భగవంత్ కేసరి’ చిత్రం చేసింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి పేరొచ్చింది. కమర్షియల్ గా కూడా ఆ చిత్రం పెద్ద సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఆమె చేసిన కొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. కమర్షియల్ గా ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ కూడా ఆమెకు అవకాశాలు తగ్గలేదు. ప్రస్తుతం నితిన్ తో ‘రాబిన్ హుడ్’, పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, అజిత్ తో ఒక సినిమా చేస్తుంది. వీటితో పాటు ఆమెకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి.

    ఇదంతా పక్కన పెడితే శ్రీలీల సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ తెగ యాక్టీవ్ గా ఉంటుంది. అభిమానులతో అప్పుడప్పుడు చిట్ చాట్ చేస్తుంది. రీసెంట్ గా ఒక అభిమాని శ్రీలీల కి ‘ఐ లవ్ యూ’ అంటూ ప్రపోజ్ చేస్తాడు. దానికి శ్రీలీల సమాధానం ఇస్తూ ‘ఉమ్ ఆ..ఉమ్ ఆ..ఐ లవ్ యూ టూ’ అంటూ ముద్దులు పెట్టి మరి ప్రపోజ్ చేసింది. ఇది చూసిన అభిమానులు షాక్ కి గురి అయ్యారు. శ్రీలీల లాంటి హీరోయిన్ నుండి ఇలాంటి రిప్లై వచ్చినందుకు ఆ అభిమాని అదృష్టవంతుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీ లీల అభిమానులతో ఇంతే సరదాగా ఉంటుంది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న ఆమె, మళ్ళీ హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలంటే అభిమానులు రీసెంట్ గా జరిగిన చిట్ చాట్ లో కోరుకున్నారు.