https://oktelugu.com/

Renu Desai : ఇండియన్ 2 ఫ్లాప్ అయ్యినందుకు చాలా సంతోషించాను అంటూ రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్!

ఈ సినిమాని థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ నిజంగా దేవుళ్ళు అంటూ ప్రశంసలు కూడా కురిపించారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో మూగజీవాలను కించపరుస్తూ ఒక సన్నివేశం ఉంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : September 7, 2024 / 06:51 PM IST

    I was very happy that Indian 2 flopped: Renu Desai

    Follow us on

    Renu Desai : ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ‘ఇండియన్’ చిత్రానికి సీక్వెల్ గా శంకర్, కమల్ హాసన్ కలిసి ‘ఇండియన్ 2’ చిత్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. శంకర్ లాంటి దర్శకుడి నుండి ఇంత చెత్త సినిమా ఎలా వచ్చింది?, అసలు ఇలాంటి దారుణమైన సన్నివేశాలను కమల్ హాసన్ గారు ఎలా ఒప్పుకున్నారు అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఒక రేంజ్ అసహనం వ్యక్తం చేసారు. థియేటర్స్ లో విడుదలైనప్పటికంటే, ఓటీటీ లో విడుదలైనప్పుడు ఈ చిత్రానికి అత్యధికంగా ట్రోల్ల్స్ పడ్డాయి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను కట్ చేసి డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ వెక్కిరిస్తూ పోస్టులు పెట్టారు నెటిజెన్స్. ఈ సినిమాని థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ నిజంగా దేవుళ్ళు అంటూ ప్రశంసలు కూడా కురిపించారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో మూగజీవాలను కించపరుస్తూ ఒక సన్నివేశం ఉంటుంది.

    I was very happy that Indian 2 flopped: Renu Desai

    దీనికి పెట్ లవర్స్ చాలా తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ డైరెక్టర్ శంకర్ పై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా లో వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ తన భావాజాలం ని వ్యక్తపరిచే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ సినిమాలో మూగజీవాలను కించపరచడం పై స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘ఇండియన్ 2 చిత్రం ఫ్లాప్ అయ్యినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సినిమా రైటర్స్ ఇడియట్స్, అసలు వీళ్ళకి ఏమైంది?’ అంటూ ఆమె పెట్టిన ఒక స్టోరీ సంచలనం గా మారింది. దీనిపై కమల్ హాసన్ ఫ్యాన్స్ నుండి రేణు దేశాయ్ చాలా తీవ్రమైన ట్రోల్ల్స్ ని సోషల్ మీడియాలో ఎదురుకుంటుంది. మనసుకి అనిపించింది అనిపించినట్టు చెప్పడం రేణు దేశాయ్ స్టైల్. తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ కి సపోర్టు గా నిలుస్తూ ఎన్నోసార్లు పోస్టులు పెట్టింది కూడా. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు అసభ్యకరమైన కామెంట్లు పెట్టినప్పుడు వారిపై పెద్ద యుద్ధమే చేసింది. అంతే కాదు సోషల్ మీడియాలో ఈమె అనేక సేవాకార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది. ఈమె స్వతహాగా పెట్ లవర్.

    కొన్ని కుక్కలకు మెడికేషన్ చేయించడం కోసం, వాటికి ఆహారం కోసం ఎంతో డబ్బుని డొనేట్ చేసింది. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ రేణు దేశాయ్ చేసే సేవాకార్యక్రమాలకు పూర్తి బిన్నంగా ఇండియన్ 2 లో ఆ సన్నివేశాలు ఉండడంతో రేణు దేశాయ్ మనసు బాగా నొచ్చుకుంది. అందుకే శంకర్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్స్ కలయిక లో వచ్చిన సినిమా అయ్యినప్పటికీ ఆమె ఘాటుగా స్పందించడంలో ఎలాంటి భయం చూపలేదు. ఆమె చూపించిన ఈ తెగువకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే అలా పోస్టు పెట్టడం వల్ల అత్యంత నెగటివిటీ ని ఎదురుకున్న రేణు దేశాయ్, నెగటివ్ కామెంట్స్ కి స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.