Sreeleela : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ లో ఒకరు శ్రీలీల. పెళ్ళిసందడి చిత్రం తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ ఆ సినిమా పెద్ద హిట్ కాకపోయినప్పటికీ కూడా శ్రీలీల డ్యాన్స్, ఆమె నటన ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఆకర్షించాయి. ఇక ఆ సినిమా తర్వాత శ్రీలీల చేసిన ‘ధమాకా’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం శ్రీలీల వేసిన డ్యాన్స్ అని అప్పట్లో విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ధమాకా చిత్రం తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఆమెకి రాలేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ అతి తక్కువ సాయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ‘ధమాకా’ చిత్రం తర్వాత ఈమె చేసిన సినిమాలలో కేవలం ‘భగవంత్ కేసరి’ మాత్రమే సూపర్ హిట్ అయ్యింది.
మిగిలిన సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. చివరికి మహేష్ బాబు కూడా ఈమెకి హిట్ ఇవ్వలేకపోయాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘గుంటూరు కారం’ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీంతో శ్రీలీల కి ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా శ్రీలీలకు తమిళ హీరో విజయ్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందట. విజయ్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో కాసేపు కనిపించినా అదృష్టం గా భావించే హీరోయిన్లు ఉన్న ఈరోజుల్లో, శ్రీలీల తనకి వచ్చిన ఐటెం సాంగ్ ఆఫర్ ని తిప్పికొట్టిందట. భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా కూడా ససేమీరా నో చెప్పిందట. అందుకు కారణం ఆమెకు ఐటెం సాంగ్స్ చేయడం లో ఎలాంటి ఆసక్తి లేకపోవడమే, పలు ఇంటర్వూస్ లో ఆమె నేరుగా ఈ విషయాన్ని చెప్పింది కూడా. తనకి ఐటెం సాంగ్స్ చెయ్యాల్సిన కర్మ పట్టలేదంటూ ‘గోట్’ మేకర్స్ కి చెప్పిందట.
దీంతో గోట్ మేకర్స్ ఆమె స్థానంలో త్రిష ని తీసుకున్నారు. విజయ్, త్రిష మీద తెరకెక్కించిన ఈ ఐటెం సాంగ్ పెద్ద ట్రోల్ మెటీరియల్ అయ్యింది. శ్రీలీల ఈ పాట చేయకపోవడమే మంచిది అయ్యింది, చేసుంటే ఆమె ఎన్నో ట్రోల్ల్స్ ఎదురుకోవాల్సి వచ్చేది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గానే విడుదలైన విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రం మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని, బాక్స్ ఆఫీస్ వద్ద మాములు స్థాయి వసూళ్లతో ముందుకు వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత విజయ్ తన కెరీర్ ని రాజకీయాల వైపుకు తిప్పుతున్నాడు.