Anvesh sensational comments: యూట్యూబర్ అన్వేష్(Youtuber Anvesh) ఇప్పటికీ కూడా తన నోటికి పని చెప్తూనే ఉన్నాడు. హిందూ దేవుళ్ళపై, హిందూ మతం పై అసభ్యమైన వ్యాఖ్యలు చేయడం, దానికి తిరిగి కౌంటర్ ఇచ్చినందుకు హిందువులను ‘బత్తాయిలు’ అంటూ కామెంట్స్ చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇతనికి అలవాటు అయిపోయింది. జనాలకు ఇతని వీడియోస్ ని చూసి సహనం నశించడం తో అందరూ ఒక్కసారి అతని ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కి రిపోర్ట్స్ కొట్టారు. కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని అతిక్రమించినందుకు అన్వేష్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయిపోయింది. ఆ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ని దాదాపుగా 13 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అయితే కాసేపటి క్రితమే అన్వేష్ తన అకౌంట్ పోవడం పై స్పందిస్తూ ఒక వీడియో చేశాడు. ఈ వీడియో ని చూసిన తర్వాత ఇతైకి బలుపు ఇసుమంత కూడా తగ్గలేదు అనే విషయం అర్థం అవుతోంది.
ఆయన మాట్లాడుతూ ‘నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పోయినందుకు చింతిస్తున్నాను అని అంటాను అనుకున్నారా బత్తాయిలు. రూపాయి లాభం ఇవ్వని ఇన్ స్టాగ్రామ్ ఉంటె ఎంత పోతే ఎంత, నా ఈకతో సమానం. ఇప్పుడు మీకొకటి చెప్తా వినండి బత్తాయిలు, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ నాకు రెండు చేతులు లాంటివి. నా రెండు కాళ్ళు రెండు యూట్యూబ్ చానెల్స్ లాంటివి. నా శరీరం ఫేస్ బుక్. ఈ 5 ని నడిపించేది నా బుర్ర. నా తెలివైన బుర్రతో ఎంతో మంది బత్తాయిలకు నిద్ర లేకుండా చేస్తున్నాను. ఈ బత్తాయిలు అందరూ కలిసి ఒక చెయ్యి ని విరగొట్టేసారు. ఇప్పుడు నాకు ఒక చెయ్యి ఉంది, రెండు కాళ్ళు ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఆ తర్వాత రెండవ చేతిని కూడా విరగొట్టేస్తారు, ఆ తర్వాత కాళ్ళు, శరీరాన్ని కూడా విరగొడుతారు. కానీ నా బుర్ర మాత్రం బ్రతికే ఉంటాది, రోజు మిమ్మల్ని టార్చర్ చేస్తూనే ఉంటుంది’.
‘నేను కనిపిస్తే మీరు నరకాల్సింది నా తలని, నా బుర్ర బ్రతికి ఉన్నంత వరకు మీకు నిద్ర పట్టకుండా చేస్తా. వినాయక స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను, 2026 వ సంవత్సరం మీ బత్తాయిలు నా చేతుల్లో అయిపోయారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా చాలా అసహ్యమైన మాటలు మాట్లాడాడు, అవి మేము ఇక్కడ ప్రస్తావించలేదు. పూర్తి వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఈ రేంజ్ లో మాట్లాడుతున్నాడు అంటే, అన్వేష్ కి పొయ్యే కాలం దగ్గర పడింది, ఇతను పొరపాటున ఇండియా కి వస్తే జనాలు ముక్క కూడా మిగిలించరు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్
ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయినా నా ఈకతో సమానం అంటూ వీడియో విడుదల చేసిన అన్వేష్
యూట్యూబ్ అకౌంట్ నుండి నెలకు రూ.8 లక్షలు వస్తాయి.. ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ అన్వేష్ కామెంట్స్ pic.twitter.com/CUQC20E21r
— Telugu Scribe (@TeluguScribe) February 20, 2026