Chinese children : దత్తత అనేది ఒక వ్యక్తి , ఆ వ్యక్తి యొక్క జీవసంబంధమైన లేదా చట్టబద్ధమైన తల్లిదండ్రులు లేదా తల్లిదండ్రుల నుంచి మరొకరి, సాధారణంగా పిల్లల సంతానాన్ని పొందే ప్రక్రియ. చట్టపరమైన దత్తతలు జీవసంబంధమైన తల్లిదండ్రుల నుంచి దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు అన్ని హక్కులు మరియు బాధ్యతలను శాశ్వతంగా బదిలీ చేస్తాయి. సంరక్షకత్వం లేదా యువకుల సంరక్షణ కోసం రూపొందించబడిన ఇతర వ్యవస్థల్లా కాకుండా, దత్తత అనేది హోదాలో శాశ్వత మార్పును ప్రభావితం చేయడానికి ఉద్దేశించబడింది. చట్టపరమైన లేదా మతపరమైన అనుమతి ద్వారా సామాజిక గుర్తింపు అవసరం. చారిత్రాత్మకంగా, కొన్ని సంఘాలు దత్తత తీసుకోవడాన్ని నియంత్రించే నిర్దిష్ట చట్టాలను రూపొందించాయి. మరికొన్ని తక్కువ అధికారిక మార్గాలను ఉపయోగించాయి 20వ శతాబ్దంలో ఉద్భవించిన ఆధునిక దత్తత వ్యవస్థలు సమగ్రమైన శాసనాలు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు దత్తతకు సంబంధించిన చట్టాలు రూపొందించుకున్నాయి. తాజాగా మన పొరుగు దేశం చైనా దత్తత నిబంధనలను మార్చింది.
30 ఏళ్ల నిర్ణయం ఉప సంహరణ..
జననాల రేటులో క్షీణతతో కొన్నేళ్లుగా ఆందోళన చెందుతున్న చైనా జనాభా అసమతుల్యత సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. దానిలోభాగంగా 30 ఏళ్ల నాటి నిర్ణయాన్ని ఉప సంహరించుకుంది. తమ దేశానికి చెందిన పిల్లలను విదేశీయులకు దత్తత ఇచ్చే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తాజాగా చైనా ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని దశాబ్దాల క్రితం తీసుకువచ్చిన ’ఒకే బిడ్డ విధానం’ తర్వాత 1992లో తమ దేశ పిల్లలను విదేశీయులకు దత్తత ఇచ్చే వెసులుబాటును బీజింగ్ కల్పించింది. అప్పటి నుంచి 1,60,000 మంది చైనా చిన్నారులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. చైనాస్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ గణాంకాల ప్రకారం.. 82 వేల మంది పిల్లలు అమెరికా కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. వారిలో ఎక్కుమంది బాలికలు ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ దత్తత ప్రక్రియ మధ్యలో ఉన్నవారిపై ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
ఒకే బిడ్డ విధానంతో సమస్య..
చైనాలో జనాభా సమస్యకు అసలు కారణం ’ఒకే బిడ్డ విధానం’. 1980 నుంచి 2015 వరకు ఆ దేశంలో పెళ్లయిన జంటలు ఒక బిడ్డకు మాత్రమే జన్మనివ్వాలనే నిబంధనను ప్రభుత్వం అమలు చేసింది. జనాభా అసమతుల్యత ప్రభావం గురించి తెలియగానే ఆ విధానానికి స్వస్తి పలికింది. జనాభా రేటును పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కొత్తగా పిల్లలను కనేవారికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించింది. అయినా ప్రస్తుతానికైతే పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. ఒకవైపు జననాల రేటు పడిపోతుండగా మరోవైపు వద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఈనేపథ్యంలో అక్కడ పెళ్లిళ్లు కూడా తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.