Sukumar Latest Movie Details: పాన్ ఇండియాలో గొప్ప చిత్రాలను చేసిన దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన తీసిన సినిమాలన్నీ అతనికి గొప్ప ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టాయి. రాజమౌళి తను చేస్తున్న సినిమాల మీద చాలా క్లారిటీగా ఉంటాడు. ఒక సినిమా ఎలా చేస్తే సక్సెస్ అవుతుందో రాజమౌళికి తెలిసినంత గొప్పగా మరే దర్శకుడికి తెలియదు. అలాంటి రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. దీంతో ప్రపంచంలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరి సరసన రాజమౌళి తన పేరు నిలుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రాజమౌళిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న సుకుమార్ లాంటి దర్శకుడు సైతం పుష్ప సినిమా చేసి దాన్ని రెండు పార్టులుగా మార్చి రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధించాడు.
ప్రస్తుతం పాన్ ఇండియాలో సుకుమార్ కి వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా కొనసాగుతూ ఉండడం విశేషం…ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉంటున్నాయి. పుష్ప 2 మూవీతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ కొల్లగొట్టాడు. ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది…
ఇక ఇప్పుడు రాజమౌళి బాటలోనే సుకుమార్ పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సుకుమార్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా తనకు రాజమౌళి చాలా ఇన్స్పిరేషన్ గా నిలుస్తాడని చెప్పాడు. ఎందుకంటే ఎప్పటికప్పుడు రాజమౌళి కొత్త ఐడియాలతో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తాడు. అలాగే సినిమా సినిమాకి తన మార్కెట్ పెంచుకుంటాడు. అందుకే నేను కూడా తన బాటలోనే నడుస్తున్నాను అంటూ సుకుమార్ చెప్పడం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది.
ఇప్పుడు రాజమౌళి పక్కన తన పేరును కూడా నిలుపుకోవాలనే ప్రయత్నంలో సుకుమార్ అయితే ఉన్నాడు. అందుకే పాన్ వరల్డ్ లో సినిమాలను చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక సుకుమార్ తను డైరెక్టర్ అవ్వడమే కాకుండా తన శిష్యులను కూడా డైరెక్టర్లుగా మారుస్తున్నాడు…