OG movie dialogue: ఈమధ్య కాలంలో యంగ్ హీరోలు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పాత సినిమాల టైటిల్స్ తో సినిమాలు చేస్తూ వస్తున్నారు. తమ్ముడు, తొలిప్రేమ, ఖుషి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి వంటి సినిమాలు ఈమధ్య కాలం లో వచ్చాయి. అంతే కాదు ఆయన సినిమాల్లోని పాటల లిరిక్స్ ని కూడా టైటిల్స్ గా పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు గుండె జారీ గల్లంతయ్యిందే, పిల్ల నువ్వు లేని జీవితం, కెవ్వు కేక వంటి సినిమాలు వచ్చాయి. వీటికి మంచి ప్రజాదరణ కూడా అందింది. ఈమధ్య కాలం లో ఆయన సినిమాల్లోని డైలాగ్స్ ని కూడా టైటిల్స్ గా వాడేస్తున్నారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు కి వెళ్లి అక్రమంగా రవాణా అవుతున్న పీడీపీ రైస్ ని పట్టుకోవడం, ఆ తర్వాత ఆయన ‘సీజ్ ది షిప్’ అంటూ ప్రకటన చేయడం ఎంత పెద్ద సంచలనం రేపిందో మనమంతా చూసాము.
‘సీజ్ ది షిప్’ అనే పదం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవ్వడం తో, దాని క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం కోసం మేకర్స్ ‘సీజ్ ది షిప్’ అనే టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. త్వరలోనే ఈ టైటిల్ మీద సినిమా కూడా రానుంది. ఇక ఈ ఏడాది థియేటర్స్ లో భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ'(They Call Him OG) చిత్రం లోని ‘బాగుల్ బువా'(Bagul Bua) అనే డైలాగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ డైలాగ్ పేరు తో కూడా ఫిల్మ్ ఛాంబర్ లో ఒక టైటిల్ ని రిజిస్టర్ చేయించారట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ‘బాగుల్ బువా’ అంటే రాక్షసుడు, దెయ్యం వంటివి పర్యాయపదాలు గా తీసుకోవచ్చు.
చిన్నపిల్లలు అన్నం తినలేము అని మారం చేసినప్పుడు మన తల్లిదండ్రులు ‘అదిగో..బూచోడు వస్తాడు..నిన్ను ఎత్తుకొని పోతాడు’ అని బెదిరిస్తారు గుర్తుందా?, ఆ బూచోడే బాగుల్ బువా. ఒక్క మాటలో చెప్పాలంటే సైతాన్ అన్నమాట. ఈ పదాన్ని ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మొట్టమొదటి సారి ఈ పదం మన తెలుగు సినిమాలో వినిపించింది. ‘ఓజీ’ లో మంచి యాక్షన్ సన్నివేశాలు పడినప్పుడు ఈ డైలాగ్ రావడం తో ఇంకా ఎక్కువ రీచ్ దక్కింది. మరి ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించిన ఈ టైటిల్ తో ఎవరు సినిమా చేయబోతున్నాడు?, హీరో హీరోయిన్లు ఎవరు వంటివి తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.