https://oktelugu.com/

Jyothi Rai: బిగ్ బాస్ ఆఫర్ తిరస్కరించాను, కీలక విషయాలు బయటపెట్టిన గుప్పెడంత మనసు జగతి ఆంటీ!

బిగ్ బాస్ ఆఫర్ అంటే చాలా మంది గంతేసి ఒప్పుకుంటారు. తాను మాత్రం తిరస్కరించాను అంటుంది. గుప్పెడంత మనసు జ్యోతిరాయ్. బిగ్ బాస్ నిర్వాహకుల ఆఫర్ తాను అంగీకరించకపోవడానికి కారణాలు కూడా ఆమె వెల్లడించారు. జ్యోతిరాయ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : August 10, 2024 / 08:23 AM IST

    Jyothi Rai

    Follow us on

    Jyothi Rai: కన్నడ నటి జ్యోతి రాయ్ గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ సీరియల్ లో హీరో రిషి తల్లి జగతి పాత్రలో నటించింది. జగతి పాత్ర కట్టు, బొట్టు .. క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. కన్నడలో జ్యోతి రాయ్ చాలా సీరియల్స్ లో నటించింది. తెలుగులో ఒక్క గుప్పెడంత మనసు ఆమెకు ఫుల్ ఫేమ్ తెచ్చిపెట్టింది. జగతి పాత్రలో అద్భుతంగా జీవించింది. అయితే కొన్ని కమిట్మెంట్స్ కారణంగా జ్యోతి రాయ్ సీరియల్ నుంచి తప్పుకుంది.

    గుప్పెడంత మనసు సీరియల్ లో ఆమె క్యారక్టర్ ని చంపేశారు. ప్రస్తుతం కన్నడ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఈ బ్యూటీ బిజీగా ఉంది. స్క్రీన్ మీద పద్దతికి చీర కట్టినట్టు ఉండే జ్యోతి రాయ్ నెట్టింట మాత్రం హాట్ బాంబ్. మితిమీరిన గ్లామర్ షో చేస్తూ కుర్రకారుని ఎట్రాక్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే .. జ్యోతి రాయ్ కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని .. ఆమె కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 లో పార్టిసిపేట్ చేస్తుందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.

    ఈ వార్తలపై తాజాగా నటి స్పందించింది. త్వరలో కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జ్యోతి రాయ్ కి అవకాశం వచ్చిందట. కానీ జ్యోతి రాయ్ ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిందట. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో రాసుకొచ్చింది. నన్ను బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించిన మాట వాస్తవమే. కానీ నేను ఆ ఆఫర్ రిజెక్ట్ చేశాను. నాకు ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్న కారణంగా షో కి వెళ్ళలేను.

    అభిమానులకు ధన్యవాదాలు అని జ్యోతి రాయ్ రాసుకొచ్చింది. తాను బిగ్ బాస్ కన్నడ 11 లో కంటెస్ట్ చేయడం లేదు అని క్లారిటీ ఇచ్చింది. జ్యోతి రాయ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని భర్త నుండి విడిపోయింది. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుకుపూర్వజ్ తో రిలేషన్ మైంటైన్ చేస్తుంది. సుకుపూర్వజ్ ని జ్యోతి రాయ్ వివాహం చేసుకుందో లేక సహజీవనం చేస్తున్నారో అనేది మాత్రం క్లారిటీ లేదు.

    జ్యోతి రాయ్ హాట్ బ్యూటీ హౌస్లోకి వెళితే షోకి చాలా ప్లస్ అవుతుందని మేకర్స్ భావించారు. వారి ఆశలపై జ్యోతిరాయ్ నీళ్లు చల్లింది. నిజానికి కొందరు సెలెబ్స్ బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. అందుకు కారణం లేకపోలేదు. బిగ్ బాస్ షో వలన తమ ఇమేజ్ పెరగకపోగా ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నారు. గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న చాలా మంది నటులు కెరీర్ కోల్పోయారు.

    మనం ఎంత మంచిగా, హుందాగా గేమ్ ఆడాలి అనుకున్నా మేకర్స్ ఎడిటింగ్స్ తో తప్పుగా ప్రొజెక్ట్ చేస్తారు. ఈ విషయాన్ని పలువురు మాజీ కంటెస్టెంట్స్ బద్దలు కొట్టారు. జ్యోతిరాయ్ కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. ఇలాంటి తరుణంలో బిగ్ బాస్ షోకి వెళ్లడం సరికాదని ఆమె భావించి ఉండవచ్చు. పెద్దగా ఫేమ్ లేని వారికి, ఫేడ్ అవుట్ అయిన నటులకు బిగ్ బాస్ మేలు చేసే అవకాశం ఉంది.