https://oktelugu.com/

Sobhita Naga Chaitanya Engagement: బ్రహ్మణ-చౌదరి.. నాగ చైతన్య శోభితాల కులాల మీద పడ్డ కేటుగాళ్లు.. వైరల్ మీమ్స్…

నాగ చైతన్య కి యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది...అందుకే ఆయన ఎక్కువగా లవ్ స్టొరీ సినిమాలనే చేస్తూ సక్సెస్ లను అందుకుంటూ ఉంటాడు...

Written By:
  • Gopi
  • , Updated On : August 10, 2024 / 08:33 AM IST

    Sobhita Naga Chaitanya Engagement

    Follow us on

    Sobhita Naga Chaitanya Engagement: అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య చాలా తక్కువ సమయంలోనే యూత్ లో మంచి క్రేజ్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. స్టార్ హీరో రేంజ్ కి తను చేరుకోలేకపోయిన కూడా మీడియం రేంజ్ హీరోగా వరుస సినిమాలను చేస్తూ తన అభిమానులతో పాటు ప్రేక్షకలోకాన్ని కూడా ఆనందింపజేస్తూ వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన సమంతతో ప్రేమ, పెళ్లి, విడాకుల వ్యవహారం ముగిసిన తర్వాత ఆయన ఎక్కడా కూడా పెద్దగా తన పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. అయితే గత కొన్ని రోజుల నుంచి శోభితా ధూళి పాళ ఎఫైర్ నడుపుతున్నప్పటికీ ఆ విషయం మీద ఆయన ఎప్పుడూ కూడా స్పష్టత అయితే ఇవ్వలేదు. ఇక రీసెంట్ గా వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరుగుతుందనే విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. నాగ చైతన్య ఇంత సైలెంట్ గా మ్యాటర్ మొత్తాన్ని సెట్ చేసాడుగా అంటూ సోషల్ మీడియాలో వీళ్ళ మీద చాలా వార్తలైతే వచ్చాయి. ఇక మొత్తానికైతే నిన్న వీళ్ళ నిశ్చితార్థం అయితే సింపుల్ గా జరిగింది. ఇక తొందర్లోనే పెళ్లి కూడా ఫిక్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇదిలా ఉంటే మీడియాలో వాళ్ళిద్దరి పెళ్లి ని పురస్కరించుకొని చాలా మీమ్స్ అయితే వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి ఏంటి అంటే శోభిత వాళ్ళ ఫ్యామిలీ పక్క బ్రాహ్మిన్స్ కుటుంబం…శోభిత తెనాలిలో పుట్టి పెరిగినప్పటికీ ఆ తర్వాత వాళ్ళ నాన్న అయిన వేణుగోపాలరావు గారి ఉద్యోగం నిమిత్తం వాళ్ళు ముంబైలో స్థిరపడాల్సి వచ్చింది. అయినప్పటికీ వాళ్ళ కుటుంబం మాత్రం ఇప్పటికీ ఎలాంటి నియమాలు అయితే పాటిస్తారో అలాంటి నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక శోభితా మోడలింగ్ రంగాన్ని ఎంచుకొని సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన విషయం మనకు తెలిసిందే. అయినప్పటికీ తను ఇప్పటికీ కూడా చాలా విషయాల్లో తమ పద్ధతులను పాటిస్తూ ముందుకు సాగుతుందని చాలా మంది చెబుతున్నారు.

    ఇక ఇదిలా ఉంటే వీళ్ళ మీద వస్తున్న మీమ్స్ అయితే ఇప్పుడు చాలామందిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి…ఇక ఇదిలా ఉంటే కొంతమంది నాగచైతన్య అభిమానులు కూడా శోభితా బ్రాహ్మిన్స్ కాబట్టి ఆమె నాన్ వెజ్ ఏమి తినదు. మరి నాగ చైతన్య చౌదరి లు కాబట్టి వీళ్ళు మాంసం తినకుండా ఉండలేరు. మరి ఈ సిచువేషన్ ను ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారుఅనే దాని మీదనే సర్వత్ర ఆసక్తి నెలకొంది. అంటూ చాలామంది కామెంట్లైతే చేస్తున్నారు…

    ఇక పెళ్లి తర్వాత నాగ చైతన్య ఈ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది అంటూ మరి కొంతమంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు… ఇక ఈ మీమ్స్ గాని, కామెంట్లు గాని వాళ్ళు చూస్తే మాత్రం వాళ్లు కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి అని ఎంజాయ్ చేస్తు నవ్వుకుంటారని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా చేయడానికి ఇటు నాగార్జున అటు శోభిత వాళ్ళ ఫ్యామిలీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది…