https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశుల వారిపై శనిదేవుడి అనుగ్రహం.. వీరి విజయానికి అడ్డంకులు ఉండవు..

జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. తల్లిదండ్రులకు బహుమతులను అందిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : August 10, 2024 / 08:18 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ రోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ఆది యోగం, సాధ్య యోగం ఏర్పడనున్నాయి. ఈ కారణంగా కొన్ని రాశుల వారిపై శనిదేవుడి అనుగ్రహం. మిగతా రాశుల వారికి ఖర్చులు పెరుగుతాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. తల్లిదండ్రులకు బహుమతులను అందిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    వృషభ రాశి:
    ఆర్థికంగా బలపడుతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తను ఈరోజు వింటారు.కొన్ని స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి.

    మిథున రాశి:
    కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడొద్దు. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. కొన్నికార్యకలాపాలకు దూరంగా ఉండాలి. లేకుంటే చిక్కుల్లో పడుతారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడుతారు.

    కర్కాటక రాశి:
    సామాజిక రంగంలో పనిచేసేవారికి అనుకూల వాతావరణం. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. రోజూ వారీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. ప్రభుత్వ పనులు త్వరగా పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

    సింహారాశి:
    వ్యాపారం చేసేవారు భాగస్వాములతో కలిసి కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. సాయంత్రం సోదరులతో ఉల్లాసంగా ఉంటారు.

    కన్య రాశి:
    ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలి. బంధువులతో విభేదాలు రావొచ్చు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

    తుల రాశి:
    భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామి సలహా మేరకు ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని బాధ్యతలు పూర్తి చేస్తారు. ఇంటిపనులు చక్కబెడుతారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి.

    వృశ్చిక రాశి:
    కుటుంబ సభ్యుల నుంచి ఒత్తడి ఉంటుంది. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. తల్లిదండ్రులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధించే అవకాశం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.

    ధనస్సు రాశి:
    ఉద్యోగులు ప్రమోషన్ పొందడానికి దారులు ఏర్పడుతాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆదాయం పెరుగుతుంది.ఈరోజుల ఖర్చులు అధికంగా ఉంటుంది. పిల్లల చదువుపై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్త వ్యక్తులను నమ్మొద్దు.

    మకర రాశి:
    వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందుతారు. విద్యార్థులు కొత్త కోర్సులో జాయిన్ అవుతారు. ఖర్చులు పెరిగిపోతాయి. ఆరోగ్య సమస్యలు వెంటాడుతయి. కుటుంబ ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు. ఇతరుల సలహా తీసుకొని వ్యాపారులు పెట్టుబడులు పెడుతారు.

    కుంభరాశి:
    వ్యాపారులు కొత్త ప్రణాళికలు ఏర్పాటు చేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేయడానికి సంకల్పిస్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. చట్టపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు.

    మీనరాశి:
    బకాయిలు వసూలవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టినట్లయితే లాభిస్తాయి. పెద్దల సలహా తీసుకోవాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రశంసలు పొందుతారు.