కరోనా కమ్మేసింది. అందరి జీవితాలను తలకిందులు చేసింది. మహమ్మారి దెబ్బతో ఐదారు నెలలుగా అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. బయటకు వెళితే వైరస్ సోకుతుందనే భయం.. ఊడిపోయిన ఉద్యోగాలు.. జీతాలు లేవు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో మానసిక సమస్యలకు దారి తీస్తోందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: కరోనాను మించి.. ముందుంది ముసళ్ల పండుగ
ఈ సమయంలోనే భార్య/భర్త తమ పార్ట్ నర్ మానసిక సామర్థ్యాన్ని అంచనా వేసుకొని మనసెరిగి ప్రవర్తించాలి. పరిస్థితులు మెరుగు అవుతాయని ధైర్యం చెబుతూ అతడిని ఒత్తిడి నుంచి దూరం చేసి లైంగిక సుఖాన్ని అందించాలి. అప్పుడు తిరిగి పూర్వపు స్థితికి వస్తారు. లేదంటే మానసికంగా, శృంగార పరంగా దెబ్బతింటారని పరిశోధనలో తేలింది.
జీవితంలో ఎదగడానికి ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉన్నారు. అన్నీ ఈ మహమ్మారి రాకతో ఆవిరైపోయాయి. కరోనాతో ఇంటికే పరిమితమయ్యాం. ఉరుకుల పరుగులతో జీవించే వారికి కుటుంబంతో కలిసి జీవించే సమయం దొరికింది. కానీ ఇప్పుడది ఎక్కువైంది. ఈ ఖాళీ టైంలో దాంపత్య జీవితం బలపడాల్సిన సమయం.. కానీ లేనిపోని మానసిక సమస్యలతో లైంగిక సమస్యలకు కారణమవుతోందని నిపుణులు తేల్చారు.
లైంగిక జీవితం సక్రమంగా సాగాలంటే మానసికంగా ఆరోగ్యం మెరుగ్గా ఉండాలి. మనసు హుషారుగా ఉండి.. ఎటువంటి ఒత్తిళ్లూ, ఆందోళనలు లేనప్పుడు లైంగికంగా చురుగ్గా ఉండగలం. కానీ ఇప్పుడు కరోనాతో ఉద్యోగాలు ఊడి జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులతో హుషారు పోయింది.
Also Read: ఆ సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!