ఇకపై వాటికి దూరం.. అంటున్న బ్యూటీ

హీరోయిన్ అన్నాక రోమాన్స్, కిస్ సన్నివేశాలు చేయాల్సిందే.. హీరో పైన, కింద నలగాల్సిందే.. ఇవన్నీ ప్రతీ సినిమాలోనూ ఉండేవే.. అలాంటివి చేయనంటే ఇండస్ట్రీలో నెగ్గురావడం కష్టం. తాజాగా ఓ హీరోయిన్ మాత్రం తాను అలాంటి సన్నివేశాల్లో నటించనంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం దేశంలో మహమ్మరి కారణంగా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలంతా ఇంటికే పరిమితయ్యారు. ఏదైనా పనిమీద బయటికెళ్లాల్సిన వచ్చినా మాస్కులు ధరించి.. భౌతిక దూరం పాటిస్తున్నారు. అయినప్పటికీ వారిలో ఏదో ఒక మూలన […]

Written By: Neelambaram, Updated On : May 25, 2020 3:53 pm
Follow us on


హీరోయిన్ అన్నాక రోమాన్స్, కిస్ సన్నివేశాలు చేయాల్సిందే.. హీరో పైన, కింద నలగాల్సిందే.. ఇవన్నీ ప్రతీ సినిమాలోనూ ఉండేవే.. అలాంటివి చేయనంటే ఇండస్ట్రీలో నెగ్గురావడం కష్టం. తాజాగా ఓ హీరోయిన్ మాత్రం తాను అలాంటి సన్నివేశాల్లో నటించనంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఆసక్తిని రేపుతోంది. ప్రస్తుతం దేశంలో మహమ్మరి కారణంగా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలంతా ఇంటికే పరిమితయ్యారు. ఏదైనా పనిమీద బయటికెళ్లాల్సిన వచ్చినా మాస్కులు ధరించి.. భౌతిక దూరం పాటిస్తున్నారు. అయినప్పటికీ వారిలో ఏదో ఒక మూలన ఈ మహమ్మరిపట్ల అభ్రదతా భావం కన్పిస్తూనే ఉంది. తాజాగా టాలీవుడ్లో షూటింగులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. షూటింగుల సందడి మొదలవుతుండగానే హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే సినిమా షూటింగులను ప్రారంభించేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ప్రస్తుతం షూటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మహ్మమరిని ఎలా కట్టడి చేస్తూ సినిమాలను చిత్రీకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల కాలంలో సినిమాల్లో ముద్దు సీన్లు, రోమాంటిక్ సన్నివేశాలు కామన్ అయిపోయాయి. వీటికి ప్రేక్షకులు కూడా అలవాటైపోయారు. అలాంటిది ఇప్పుడు ఈ సన్నివేశాలు లేకుండా సినిమాలు తీసారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ విషయంపై కుండబద్దలు కొట్టింది. షూటింగ్‌లు ప్రారంభించినా ఇంతకుముందులా కౌగిలింత, ముద్దు సన్నివేశాలను తెరకెక్కించడం అంత ఈజీ కాదని అంటోంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించాలంటే చాలా ఆలోచించాల్సిందే.. ఇకపై అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వస్తే నేను `నో` చెబుతాను.. ప్రస్తుతానికి అలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది.. మన ఆరోగ్యం, చుట్టూ ఉన్న వారి ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాన’ని లావణ్య త్రిపాఠి చెబుతోంది. లావణ్య చెబుతున్నది వాస్తవమే అయినప్పటికీ సినిమాల్లో రోమాన్స్ సన్నివేశాలు లేకుండా తీయడం కూడా కష్టమే. దీంతో ఇలాంటి సన్నివేశాలను ఎలా తీయాలని దర్శకులు తలలు పట్టుకున్నారు. దీంతో కొన్ని రోజులపాటు ఈ సన్నివేశాలను వాయిదా వేస్తారా? లేక మొత్తానికే తొలగిస్తారా? అనేది వేచి చూడాల్సిందే..!