spot_img
Homeఎంటర్టైన్మెంట్Rathika Rose: టాప్ 5 లో ఉండే అర్హత నాకు లేదు.. నన్ను క్షమించండి అని...

Rathika Rose: టాప్ 5 లో ఉండే అర్హత నాకు లేదు.. నన్ను క్షమించండి అని వేడుకున్న రతికా..

Rathika Rose: బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టమే. ఎవరు ఉంటారో? ఎవరు ఇంట్లో నుంచి వెళ్తారు అనేది తెలియడం కూడా కష్టమే. అయితే ఈ ఇంటి నుంచి గతంలోనే రతిక రోజ్ ఎలిమినేట్ అయి బయటకు వెళ్లింది. కానీ అదృష్టం కొద్ది మళ్లీ తిరిగి వచ్చింది ఈ అమ్మడు. ఊహించని విధంగా ఇంటి నుంచి వెళ్లిపోయి ఆమె అభిమానులను నిరాశ పరిచింది. టాప్ 5లో ఉంటుందనుకున్న రతిక ఎలిమినేట్ అవడంతో ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇంటి నుంచి బయటకు వచ్చిన రతిక పలు ఇంటర్వ్యూలకు హాజరవుతుంది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది ఈ అమ్మడు. ఇప్పుడు ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. నేను గేమ్ లో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఆడియన్స్ సపోర్ట్ చేస్తూ వచ్చారని రతిక కామెంట్లు చేశారు. యాక్టివిటీల పరంగా నేను వీక్ అని ఆమె తెలిపారు. సెకండ్ టైమ్ ఛాన్స్ వచ్చినా సరిగ్గా వినియోగించుకోలేకపోయానని ఆమె అన్నారు. ఈ విషయాన్ని అంగీకరిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఫస్ట్ టైమ్ ఎలిమినేట్ అయినసమయంలో శివాజీ, ప్రశాంత్ లను కనీసం చూడకుండా రావడానికి కారణం ఉందని రతిక కామెంట్లు చేశారు.

తాను ఎలిమినేట్ అయ్యాననే ప్రకటన వినగానే మైండ్ బ్లాంక్ అయిందని ఆమె అన్నారు. బయటకు వచ్చాక కొన్ని విషయాలు తెలిసి వాళ్లకు సారీ చెప్పానని వెల్లడించింది ఈమె. తాను కన్నింగ్ స్టార్స్ అని కొంత మంది కామెంట్లు చేశారని.. రెండోసారి హౌస్ లోకి వెళ్లిన సమయంలో అది పోగొట్టుకున్నానని అనుకుంటున్నట్టు తెలిపింది. మొదటి సారి ఎలిమినేటై బయటకు వచ్చిన సమయంలో నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారని అర్థమైందని.. వైల్డ్ కార్డ్ లో వచ్చిన వాళ్లకు నా గురించి ఎందుకు అని రతిక పేర్కొన్నారు. రెండోసారి వెళ్లిన సమయంలో మరింత డౌన్ అయ్యానని ఆమె అన్నారు.

నేను అందరితో బాగున్నానని ఏ బ్యాచ్ తో కలవలేదని ప్రశాంత్ విషయంలో తప్పులను అంగీకరిస్తానని రతిక తెలిపారు. బిగ్ బాస్ టాప్ 5లో ఉండే అర్హత నాకు లేదని అందుకు నన్ను క్షమించాలని టాప్ 3లో ఒకరిగా శివాజీ అన్నను చూడాలని అనుకుంటున్నానని రతిక తెలిపారు. రతిక చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Oktelugu Epaper