I Bomma Ravi: ఆరేళ్ళ నుండి పైరసీ సామ్రాజ్యాన్ని ఏలుతూ సినీ ఇండస్ట్రీ కి ముచ్చమటలు పట్టించిన ఐ బొమ్మ రవి పేరు గత నెల రోజుల నుండి ట్రెండ్ అవుతూనే ఉంది. తన భార్య తో విబేధాలు రావడం, ఆమె విడాకులు కోసం హైదరాబాద్ కి వచ్చి , ఐ బొమ్మ రవి వివరాలు మొత్తం పోలీసులకు అందించడంతో, వేంటనే ఆయన్ని అదుపులోకి తీసుకున్నాడు. గత నెల రోజుల నుండి పోలీస్ కస్టడీ లోనే ఉన్న ఐ బొమ్మ ఇది వరకు అందించిన సమాచారం ప్రకారం చూస్తే, ఆయన తమిళ్ మూవీ, మూవీ రూల్స్ వంటి వెబ్ సైట్స్ వద్ద కొత్త సినిమాల ప్రింట్స్ ని కొనుగోలు చేసి ఐ బొమ్మ లో అప్లోడ్ చేసేవాడిని అని చెప్పుకొచ్చాడు. పోలీసులు ఇప్పటికే ఇతని నుండి మూడు కోట్ల రూపాయిల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. అంతే కాకుండా ఎన్నో బెట్టింగ్స్ యాప్స్ లో కూడా ఇతని పాత్ర ఉన్నట్టుగా గురించారు.
ఇదంతా పక్కన పెడితే నేడు కోర్టు లో ఇతని కేసు కి సంబంధించిన విచారణ జరుగుతోంది. పోలీసులు అతన్ని కోర్టుకి తరలిస్తున్న సమయంలో ఒక టీవీ 9 రిపోర్టర్ తో ఆయన మాట్లాడిన తీరుని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఐ బొమ్మ రవి అని పిలిచినందుకు ‘నాపేరు రవి నా?, ఐ బొమ్మ రవి నా?’ అంటూ సీరియస్ గా సమాధానం ఇచ్చాడు. జరుగుతున్న సంఘటనల పై మీరేమి చెప్తారు అంటూ రవి ని అడగ్గా ‘మీతో చెప్పాల్సిన అవసరం లేదు, కోర్టు లో మాట్లాడుతాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ బెట్టింగ్ యాప్స్ లో మీ పాత్ర ఎంత అని అడగ్గా ‘ నేను బెట్టింగ్ యాప్స్ లో ఉన్నానని మీకు ఎవరు చెప్పారు’ అని అంటాడు. ఇలా ఆద్యంతం రిపోర్టర్ కి పొగరుగానే సమాధానం చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం.
ఇది చూసిన నెటిజెన్స్ వీడి బలుపు ఇంకా తగ్గలేదు రోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయినా అతన్ని ఎందుకు అంతలా వేధిస్తున్నారు, ఇలాంటోళ్లని కాకకుండా, నా అన్వేషణ లాంటి దుర్మార్గులను పట్టుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐ బొమ్మ రవి కి మొదటి నుండి నెటిజెన్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే తమకు థియేటర్ కి వెళ్లి 400 రూపాయిలు ఖర్చు చేసి చూసే తలనొప్పి లేకుండా, ఇంట్లోనే కూర్చొని కుటుంబం మొత్తం కూర్చొని చూసేలా చేసాడు అనే సానుభూతి జనాల్లో ఉంది. అంతే కాకుండా పోలీసులు కూడా అతన్ని మర్యాదగానే చూస్తున్నట్టు అర్థం అవుతోంది. బహుశా తన వివరాలు మొత్తం ఇచేసాడేమో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.
iBomma Ravi అని పిలిస్తే Irritate అయిన Ravi
నా పేరేంటి? రవా? iBomma రవా? #iBommaRavi
Video courtesy: TV9 pic.twitter.com/TSXwQysYLr
— M9 NEWS (@M9News_) December 29, 2025