2026 New Year Bikes: కొత్త సంవత్సరం అనగానే చాలామందికి కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఇయర్ ప్రారంభంలో ఏదైనా ఒక మంచి పనిని ప్రారంభించాలని అనుకుంటారు. అలాగే న్యూ ఇయర్స్ సందర్భంగా కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని నాన్ వేసుకుంటారు. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి 2026వ సంవత్సరంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బైక్స్ తీసుకురానున్నాయి. వీటిలో Royal Enfield, KTM sports bike, BMW entry level adventure, Honda కంపెనీలు తమ నూతన ఉత్పత్తులను నేటి యూత్ కు అనుగుణంగా రెడీ చేసి మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఇవి గతంలో కంటే ఇంజన్, ఫీచర్స్ విషయంలో అభివృద్ధి సాధించి ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి. అయితే కొత్త సంవత్సరంలో వచ్చే ముఖ్యమైన ద్విచక్ర వాహనాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
Royal Enfield Bullet 650:
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అనగానే యూత్ కు ఎక్కడా లేని ఉత్సాహం ఉంటుంది. దీనిపై ఒకసారి అయినా రైడ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. అయితే కొందరు ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన బైక్ ను కలిగి ఉన్నా.. దానిని అప్డేట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొత్తగా బైక్ కొనేవారికి, పాతవాటి స్థానంలో కొత్తదాన్ని చేర్చుకునే వారికి అనుగుణంగా కొత్తగా బుల్లెట్ 650 ని మార్కెట్లోకి తీసుకు రాబోతుంది. ఇప్పటివరకు వచ్చిన బుల్లెట్ 350 నుంచి ఇది అప్డేట్ అవ్వనుంది. ఇందులో రెండు కలర్స్ మాత్రమే ఉన్నాయి. ట్విన్ సిలిండర్ ఇంజన్ తో పాటు క్లాసిక్ లుక్ ఉండనుంది. అలాగే స్మూత్ డ్రైవింగ్ రైడర్లకు మంచి అనుభూతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ బైక్ లో 648 సీసీ పార్లర్ ఇంజన్ ఉండనుంది.
KTM RC 160:
ప్రత్యేకంగా స్పోర్ట్స్ బైక్ కావాలని కోరుకునే వారికి KTM కంపెనీ న్యూ ఇయర్ లో RC 160 అనే బైక్ తీసుకురాబోతుంది. గతంలో వచ్చిన RC సిరీస్ కు చాలా గ్యాప్ తర్వాత ఈ కొత్త బైక్ను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఇందులో 164 సిసి లిక్విడ్ కూల్డ్ ఇంజన్. ఇది పూర్తిగా ఫెయిర్డ్ స్పోర్టీ డిజైన్ ను కలిగి ఉంది. యు ఎస్ డి ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ ఛానల్ ఏపీఎస్ ఉన్నాయి. ఈ బైక్ లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఆకర్షిస్తుంది. యువ రైడర్లకు కొత్త డ్రీమ్ స్పోర్ట్స్ బైక్ గా నిలవ నుండి. ఇప్పటివరకు మార్కెట్లోకి వచ్చిన ఆర్ 15 ధరకే దీనిని విక్రయించాలని చూస్తున్నారు.
Bmw F 450 GS:
BMW కంపెనీకి చెందిన ఎఫ్ 450 జి ఎస్ బైక్ త్వరలో రాబోతుంది. ఈ కొత్త బైక్ 420 సిసి ట్విన్ సిలిండర్ కలిగి ఉంది. ఇండియాలో టీవీఎస్ తో కలిసి దీనిని స్థానికంగా తయారు చేస్తున్నారు. ఈ బైక్ లో టి ఎఫ్ టి డిస్ప్లే, రైడింగ్ మోడ్, యాక్షన్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 390 అడ్వెంచర్ తో ఈ బైక్ పోటీ పడబోతుంది.