https://oktelugu.com/

బిగ్ బాస్ కు అవినాష్ ఎందుకు వెళ్లాడో చెప్పిన హైపర్ ఆది 

జబర్దస్త్ లో హైపర్ ఆది అదిరిపోయే కామెడీతో ఆకట్టుకుంటడని అందరికీ తెల్సిందే. తన స్కిట్ల ద్వారా హైపర్ ఆది ఎవరినీ వదలకుండా పంచ్ పేలుస్తుంటారు. జబర్దస్త్ కంటెస్టులతోపాటు జడ్జీలపై కూడా ఆది అదిరిపోయే పంచులు వేస్తూ అందరినీ నవ్విస్తుంటాడు. కేవలం సెలబ్రెటీలపైనే కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలు.. సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ కామెడీ చేస్తుంటాడు. Also Read: క్వారంటైన్లోకి వెళ్లనున్న రాంచరణ్, ఎన్టీఆర్..! నెలఖారు నుంచి ‘ఆర్ఆర్ఆర్’ జబర్దస్త్ లో కేవలం ఆది స్కిట్లను చూసేవారు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 3, 2020 / 01:33 PM IST
    Follow us on

    జబర్దస్త్ లో హైపర్ ఆది అదిరిపోయే కామెడీతో ఆకట్టుకుంటడని అందరికీ తెల్సిందే. తన స్కిట్ల ద్వారా హైపర్ ఆది ఎవరినీ వదలకుండా పంచ్ పేలుస్తుంటారు. జబర్దస్త్ కంటెస్టులతోపాటు జడ్జీలపై కూడా ఆది అదిరిపోయే పంచులు వేస్తూ అందరినీ నవ్విస్తుంటాడు. కేవలం సెలబ్రెటీలపైనే కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలు.. సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ కామెడీ చేస్తుంటాడు.

    Also Read: క్వారంటైన్లోకి వెళ్లనున్న రాంచరణ్, ఎన్టీఆర్..! నెలఖారు నుంచి ‘ఆర్ఆర్ఆర్’

    జబర్దస్త్ లో కేవలం ఆది స్కిట్లను చూసేవారు ఎంతోమంది ఉన్నారు. గుక్కతిప్పుకోకుండా అదిరిపోయే పంచులువేస్తూ అందరినీ నవ్విస్తుంటాడు. తన టీంలో ఉండే దొరబాబు.. తదితర కంటెస్టులపై నిత్యం పంచ్ పేలుస్తూ ఆది ఆకట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా జబర్దస్త్ నుంచి అవినాష్ ‘బిగ్ బాస్’కు వెళ్లడంపై ఆది షాకింగ్ కామెంట్స్ చేశాడు.

    జబర్దస్త్ లో ముక్కు అవినాష్ కామెడీయన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల అతడు జబర్దస్త్ కు బైబై చెప్పి బిగ్ బాస్-4లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ రెండోవారంలో వైల్డ్ కార్డుతో అవినాష్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ కంటెస్టులతో కామెడీ చేస్తూ ఆకట్టుకున్నాడు.

    అవినాష్ బిగ్ బాగ్ లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చాడనే రహస్యాన్ని ఆది తన స్కిట్ తో తాజాగా రివిల్ చేశాడు. స్కిట్‌లో భాగంగా హైపర్ ఆది వంటమాస్టర్ గా కన్పించాడు. ఆది భార్యగా శాంతి స్వరూప్ కన్పించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ద్వారా అవినాష్ బిగ్ బాస్ ఎంట్రీపై ఆది పంచ్ వేశాడు.

    Also Read: మున్ముందు ఓటీటీ సినిమాలంటే భయపడాలేమో..

    స్కిట్ లో భాగంగా ఆదితో తన భార్య ‘ఎంత కాలమని ఇలా గరిటే పట్టుకొని వంటలు చేసుకుంటాం.. కనీసం ఈఎంఐలో ఒక ఇల్లు తీసుకోవచ్చుగా.. అని అంటోంది. దీనికి ఆది స్పందిస్తూ ‘వాటి గురించి మాట్లాడకు.. ఇలా హౌస్‌లకు ఈఎంఐలు కట్టలేకే మనోడు ఒకడు వేరే హౌస్‌కు వెళుతున్నాడు తెలుసుగా..’ అంటూ ఆది సెటైర్ వేశాడు. అవినాష్ కేవలం ఇంటి అప్పు తీర్చేందుకే బిగ్ బాస్ హౌజ్ వెళ్లాడనే రహస్యాన్ని ఆది ఇన్ డైరెక్టగా వెల్లడించాడు.