Hyper Aadi: భజన బ్యాచ్ అనేది ప్రతి హీరోకి ఉంటుంది. ఈమధ్య మెగా ఫ్యామిలీ హీరోలకి ఇది మరి కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సినిమా రంగంలో కాంట్రవర్సీలకి, వివాదాలకు దూరంగా ఉండాలని అనుకుంటారు. కానీ వారి చుట్టూ ఉన్న బ్యాచ్ మాత్రం ఈ హీరోలను సమస్యల్లో పడేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోలని అవసరానికి మించి పొగుడుతూ అవతల వారి ఫాన్స్ ని, హర్ట్ చేయడంలో ముందుంటారు ఈ భజన బ్యాచ్.
పవన్ కళ్యాణ్ ని అతిగా పొగడడంలో బండ్ల గణేష్ మొన్నటి వరకు పిహెచ్డి చేసిన స్టూడెంట్ లాగా ఉండేవారు. అయితే దానివల్ల వచ్చే సమస్యలు ముందుగానే గమనించిన పవన్ కళ్యాణ్ గణేష్ ని కొంచెం దూరం పెడుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ లాగా ఇప్పుడు చిరంజీవి కూడా అదే మార్గం ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే వాల్తేరు వీరయ్య సినిమా నుంచి చాలామంది అనవసరంగా ఎక్కడ చూడు చిరంజీవిని మరీ ఎక్కువగా పొగుడుతూ కనిపిస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హైపర్ ఆది గురించి. జబర్దస్త్ తో ఫేమస్ అయిన హైపర్ ఆది అక్కడ రాసే డైలాగులు ఇప్పుడు మెగా ఫ్యామిలీ కోసం రాయడం మొదలుపెట్టారు.
ముఖ్యంగా మొన్న జరిగిన భోళా శంకర్ ప్రిరిలీజ్ ఈవెంట్‌లో హైపర్ ఆది ప్రసంగం చూసిన వారందరూ బండ్ల గణేషే గుర్తుకు వచ్చారు అని అంటున్నారు. ఆయన అతిగా చేసే ప్రసంగాలు మెగా ఫ్యామిలీకి కొత్త సమస్యలు తెచ్చి పెట్టేలా ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు.
ఇందుకు ముఖ్య కారణం మొదటిగా సినిమా ఫంక్షన్ లో హైపర్ ఆది రాజకీయాన్ని తీసుకురావడం. ప్రస్తుతం చిరంజీవి రాజకీయంగా దూరంగా ఉన్నారు. ఆయన రాజకీయాల్ని పట్టించుకోవడం లేదు. సీఎం జగన్ ని కూడా సినిమాల పరంగా చిరంజీవి కలుపుకొని పోతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన ఫంక్షన్ లో హైపర్ ఆది చెలరేగిపోయారు. అందరికీ ఇచ్చి పడేశానని అనుకుని.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. దీంతో ఆయన ఏదో మెగా అభిమానులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాను అనుకుంటున్నారేమో కానీ, దీని వల్ల మెగా కుటుంబానికి మాత్రం రాజకీయ పార్టీలలో మరింత సమస్యలు తెచ్చి పెట్టేలా చేశారు.
అంతేకాకుండా మెగా ఫ్యామిలీపై సోషల్ మీడియాలో వచ్చే ఆరోపణల్ని పబ్లిక్ చేసిన హైపర్ ఆది. హీరోలు అన్నాక ఏదో ఒక ట్రోల్ సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. అవి పట్టించుకోకుండా ఉండడం మేలు. కానీ హైపర్ ఆది మాత్రం అనవసరమైన హైపర్ కి వెళ్లి ఉదయ్ కిరణ్ ఇష్యూ నుంచి పోసాని వరకూ అందరిపై మాట్లాడారు.
ఇంకొంచెం మితిమీరి చిరంజీవికి చేతకాలేదని పవన్ వచ్చారని… ఆయన లెక్కలు సరి చేస్తారన్నట్లుగా చెప్పారు. దీంతో పవన్ గురించి చెప్పేందుక మెగాస్టార్ ను కించ పరిచేలా మాట్లాడారు అని మెగా అభిమానులే హైపర్ ఆదిని తిడుతున్నారు. అంతేకాకుండా ఆయన చేసిన అతితో సినిమాకు నష్టం జరుగుతోందన్న అభిప్రాయానికి వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటాడు.. తనను తిడితే తనకు పోయేదేమీ ఉండదని… ఎవరైనా సరే పోలవరం… అమరావతి వంటి రాష్ట్ర సమస్యలపై మాట్లాడాలని.. తనపై తిట్లకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని. పవన్ అంత క్లారిటీగా ఉన్నప్పుడు ఈ చుట్టూ ఉన్నవారు మాత్రం ఎందుకు అతి చేసి అనవసరంగా మెగా ఫ్యామిలీ పై నెగెటివిటీ తీసుకొస్తున్నారు అర్థం కావడం లేదు.