జబర్దస్త్ షో గురించి తెలియని వారుండరు. రెండు తెలుగు ప్రాంతాల్లోనే కాకుండా దేశం మొత్తం తెలుగువారికి సుపరిచతమైన జబర్దస్త్ షో కామెడీ గురించి అందరికి ఆత్రమే. బుల్లితెర చరిత్రలో ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభమైన షో అప్రతిహంగా దూసుకుపోతోంది. ఎంతో మందికి జీవితాన్నిస్తోంది. ఆర్టిస్టులను తయారు చేస్తోంది. వ్యాఖ్యాతలు, నటులు, డైరెక్టర్లు, రచయితలు తమ నైపుణ్యంతో జబర్దస్త్ ను ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కిస్తూనే ఉన్నారు. ఎందరినో సెలబ్రిటీలుగా మారుస్తోంది. మల్లెమాల ప్రొడక్షన్ సమర్పణలో మొదలైన ఈ షో ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఎంతో మంది జంటలుగా వెలుగొందుతున్నారు. అదే కోవలో సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ కాగా ప్రస్తుతం ఇమ్మాన్యుయేల్, వర్ష జంట కూడా ఓ వెలుగు వెలిగిపోతోంది.
కమెడియన్ గా రంగప్రవేశం అడుగుపెట్టిన హైపర్ ఆది ఇప్పుడు జబర్దస్త్ కు గుండెకాయగా మారిపోయాడు. అతడి పంచ్ లకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో ఊహించని రీతిలో క్రేజ్ తెచ్చుకున్న నటి వర్ష. అంతకుముందు పలు సీరియళ్లలో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ జబర్దస్త్ షో ద్వారా ఫుల్ పాపులర్ అయింది. పటాస్ షో నుంచి ఎంట్రీ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్ బబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి కమెడియన్ గా గుర్తింపు పొందాడు.
జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ జంటలాగా వర్ష, ఇమ్మాన్యుయేల్ జంట కూడా పాపులర్ అయింది. చాలా రోజులుగా వీరి మధ్య కూడా ట్రాక్ నడుస్తుందని ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్ షోలో భాగంగా ఇమ్మాన్యుయేల్, వర్షను కూడా జంటగా చూపిస్తున్నారు. ఇదే సమయంలో వీరిద్దరిని హైలెట్ చేస్తూ ట్రాక్ ను క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు అప్పుడప్పుడు హగ్గులిచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. ఫలితంగా ఈ జంటకు కూడా ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చేసింది.
వర్ష కొద్దిరోజుల కిందట తనకు ఎంగేజ్ మెంట్ రింగ్ ధరించిన ఓ ఫొటోను ఇన్ స్రాలో షేర్ చేసింది. అంతేకాదు జులై 4న బిగ్ అనౌన్స్ మెంట్ అంటూ పేర్కొంది. దీంతో ఇదంతా నిజమే అని అనుకున్నారు. అయితే వర్ష చేసింది కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రమోషన్ కోసమని తర్వాత తెలిసింది. ఇందులో వర్ష ఇమ్మాన్యుయేల్ కు పెళ్లి చేశారు. ఈ ఎపిసోడ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య ఓ స్కిట్ లో వర్ష, ఇమ్మాన్యుయేల్ వేరే పెళ్లి చేసుకున్నట్లు చూపించారు. దీంతో స్కిట్ తరువాత రోజు వర్ష స్కిట్ లోనే ఇంత బాధ పడుతుంది.
నిజంగా ఇమ్మూకు వేరే వాళ్లతో పెళ్లైతే నీ పరిస్థితి ఏంటి? అని అడగ్గా ప్రతి అమ్మాయి ఇష్టపడిన అబ్బాయిత లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటుంది కానీ మన ప్లేస్ లో వేరే వాళ్లు ఉంటే తట్టుకోవడం కష్టం మేడం అంటూ ఏడ్చేసింది. వచ్చే వారం ప్రసారం కానున్న జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో హైపర్ ఆది అదే షోకు డైరెక్టర్ గా నటించాడు.
ఇందులో భాగంగానే షోను పైకి లేపేందుకు అతడు ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడన్నది ఫన్నీగా చూపించాడు. ఇందులో వర్ష ఇమ్మాన్యుయేల్ మద్య జరుగుతున్న ట్రాక్ వెనుక ఉన్న అసలు గుట్టు విప్పేశాడు. గతంలో వర్ష ఇమ్మాన్యుయేల్ కోసం ఏడ్చిన దాన్ని గుర్తు చేసేలా అజీజ్ రీతూ చౌదరితో నటింపచేశాడు. అప్పుడు రోజా అడగ్గానే వాళ్లిద్దరూ ఎలా చేశారో ఇప్పుడు వీళ్లిద్దరు అలాగే కనిపించారు. దీంతో అప్పుడు జరిగిందంతా డైరెక్షన్ లో భాగమేనని అర్థం అయింది. దీంతో ఈ జోడి మద్య నిజంగా జరిగింది ఇదే అని హైపర్ ఆది బయట పెట్టడంతో విషయం లీకైంది.