https://oktelugu.com/

నా హత్యకు ఓ మంత్రి సుపారీ ఇచ్చాడు: ఈటల సంచలన ఆరోపణలు

టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి ఆ పార్టీనే ఢీకొంటున్నాడు ఈటల రాజేందర్. కేసీఆర్ లూప్ హోల్స్ అన్నీ బయటపెడుతున్నాడు. బీజేపీలో చేరి కొరకరాని కొయ్యగా మారుతున్నాడు. అందుకే ఈటలను ఓడించడానికి టీఆర్ఎస్ మంత్రులు, కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. అయితే ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు పాదయాత్రను హుజూరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఉప ఎన్నికల యుద్ధంలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు ఓ కరీంనగర్ జిల్లాకు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 19, 2021 / 07:11 PM IST
    Follow us on

    టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి ఆ పార్టీనే ఢీకొంటున్నాడు ఈటల రాజేందర్. కేసీఆర్ లూప్ హోల్స్ అన్నీ బయటపెడుతున్నాడు. బీజేపీలో చేరి కొరకరాని కొయ్యగా మారుతున్నాడు. అందుకే ఈటలను ఓడించడానికి టీఆర్ఎస్ మంత్రులు, కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. అయితే ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు పాదయాత్రను

    హుజూరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఉప ఎన్నికల యుద్ధంలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు ఓ కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి కుట్ర చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడివి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

    తాజాగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘తనను చంపడానికి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి హంతక ముఠాలతో సంప్రదింపులు చేస్తున్నారని’ ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు.‘అరె కొడుకుల్లారా? ఖబర్ధార్.. నరహంతకుడు నయీం నన్ను చంపుతా అంటేనే నేను భయపడలేదు. మీ చిల్లర ప్రయత్నాలకు అసలు భయపడను. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసినవాడిని.. ఈటల మల్లయ్య కొడుకును.. ఆత్మగౌరవం కోసం కొట్లాడుతా.. దుబ్బాకలో ఏం జరిగిందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది’ అని తీవ్రస్థాయిలో ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.

    సీఎం కేసీఆర్ రజాకర్ల పాలనను తలపిస్తున్నారని ఆయన అన్నారు. 2018 ఎన్నికల్లో నన్ను ఓడించడానికి ఎన్ని కుట్రలు చేసినా నియోజకవర్గ ప్రజలు నాకు అండగా ఉండి గెలిపించారని..ఇప్పుడు నిలుస్తారని.. నాకు చట్టం మీద నమ్మకం ఉందన్నారు.