https://oktelugu.com/

Hyper Aadi: కాజల్ ని కూడా వదలని హైపర్ ఆది… తాకాలని ఉందంటూ పిచ్చి చేష్టలు, ఆమె రియాక్షన్ ఇదే!

పెళ్లి తర్వాత కాజల్ సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంది. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సత్యభామ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 17, 2024 / 04:01 PM IST

    hyper aadi satires on kajal aggarwal

    Follow us on

    Hyper Aadi:ఈటీవీలో ప్రసారం అవుతున్న డాన్స్ రియాలిటీ షో ఢీ లేటెస్ట్ ఎపిసోడ్ కి హీరోయిన్ కాజల్ అగర్వాల్ అతిథిగా విచ్చేసింది. అందాల చందమామ ఢీ షోలో సందడి చేసింది. అయితే హైపర్ ఆది కాజల్ భర్త పై పంచులు వేశాడు. ఆమెను ఫ్లర్టింగ్ చేస్తూ రచ్చ చేశాడు. కాజల్ ని కూడా వదలని హైపర్ ఆది తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది.

    అయితే పెళ్లి తర్వాత కాజల్ సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంది. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సత్యభామ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కాజల్ కనిపించబోతుంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఢీ షోలో గెస్ట్ గా అడుగుపెట్టింది. హైపర్ ఆది చాలా కాలంగా ఢీ షోలో మెంటర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

    కాజల్ అగర్వాల్ రావడంతోనే హైపర్ ఆది ఇంప్రెస్స్ చేయడానికి తెగ ట్రై చేశాడు. మీ పెళ్లి రోజు అక్టోబర్ 30 కదా అని కాజల్ ని హైపర్ ఆది అడగ్గా… ఆమె అవునని బదులిచ్చారు. ఆ రోజు నా డెత్ డేట్ అంటూ హైపర్ ఆది పంచులు వేశాడు. పెళ్ళికి ముందు నీ మీద ఎన్నో కవితలు రాసుకున్న అని తెలిపాడు. మరి పెళ్లి తర్వాత అని కాజల్ అడిగారు. పెళ్లి తర్వాత కిచ్లు(కాజల్ భర్త) బాధితుడిగా మారాను అంటూ జోక్ చేశాడు. ఆ తర్వాత కాజల్ అగర్వాల్, శేఖర్ మాస్టర్ కలిసి స్టెప్స్ వేశారు.

    ఇక చివర్లో హైపర్ ఆది, కాజల్ అగర్వాల్ దగ్గరకు వెళ్లి… మగధీర సినిమాలోని ‘పంచదార బొమ్మ’ పాట పాడారు. ‘గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది .. నేను నిన్ను తాకితే తప్పా’ అని హైపర్ ఆది పాడాడు. వెంటనే కాజల్ .. ‘గాలి ఊపిరయ్యింది, నేల నన్ను నడిపింది .. ఏమిటంట నీలోని గొప్ప’ అంటూ క్యూట్ గా బదులు పాడింది. దెబ్బకు సెట్ మొత్తం హోరెత్తింది. ఈ స్పెషల్ ఎపిసోడ్ చాలా ఎంటర్టైనింగ్ ఉండేలా కనిపిస్తుంది.