Algeria: ఒక యువకుడిని కిడ్నాప్ చేసి కేవలం 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు నిర్బంధించాడు. చివరకు ఓ సోషల్ మీడియా పోస్టు బాధితుడికి విముక్తి కలిగింది. ఈ ఘటన అల్జీరియాలో జరిగింది.
ఏం చేశాడంటే..
ఉత్త అల్జీరియాలోని డెజల్ఫా ఊళ్లో 1998లో ఒమర్ బిన్ ఒమ్రాన్ అనే 19 ఏళ్ల యువకుడు కిడ్నాప్ అయ్యాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, ఒమర్ జాడ దొరకలేదు. ఓ రోజు ఒమ్రాన్ పెంపుడు కుక్క పొరుగింటి వద్ద వాసన చూస్తూ తిరిగింది. కానీ దీనిని కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఆ కుక్క హఠాత్తుగా చనిపోయింది.
అంతర్యుద్ధంతో ఆశలు గల్లంతు..
తర్వాత దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. దీంతో ఒమ్రాన్ కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. అలా 26 ఏళ్లు గడిచిపోయాయి. కొడుకు కోసం ఎదురు చూసిన తలి 2013లో చనిపోయింది. ఇటీల కిడ్నాపర్‌కు సోదరుడి వరుస అయ్యే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్లాడు. తన సోదరుడు ఓ కిడ్నాప్ చేశాడని పేర్కొన్నాడు. ఈ విషయం ఒమ్రాన్ కుటుంబం గ్రహించి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. కిడ్నాప్ కేసు తిరిగి తెరిపించి విచారణ చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో అధికారులు పొరుగింటిపై దాడిచేసి గాలింపు చేపట్టారు.
గొర్రెల కొట్టంలో…
ఈ క్రమంలో ఇంటి సమీపంలో ఉన్న గొర్రెల కొట్టం సెల్లార్‌లో ఉన్నట్లు గ్రహించారు. అందులోకి వెళ్లి చూడగా ఒమ్రాన్ కనిపించాడు. అధికారులు అతడిని రక్షించారు. ఈ సందర్భంగా బాధితుడు తాను 26 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నట్లు తెలిపాడు. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు ఈ మార్గంలో వెళ్తుంటే చూసేవాడినని పేర్కొన్నారు. పిలుద్దామంటే కిడ్నాపర్ పక్కనే ఉంటేవాడని వెల్లడించాడు. బాధితుడిని రక్షించి 64 ఏళ్ల వయసున్న కిడ్నాపర్‌ను అరెస్ట్ చేశారు.