https://oktelugu.com/

ప్రముఖ టీవీ నటితో హైపర్ ఆది పెళ్లి..: ఎక్కడంటే..?

జబర్దస్త్ ప్రొగ్రాం ఎంత పాపులారిటీ సాధించిందో అందరికీ తెలుసు. సినిమా కంటే ఎక్కువగా ఈ షోకు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ షో పాపులారిటితో ఇందులోని నటులకు అంతేస్థాయిలో గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా హైపర్ ఆది స్కిట్స్ అంటే నవ్వకుండా ఉండరు. పంచ్ లు, ప్రాసలతో ఆకట్టకునే హైపర్ ఆది టీం స్కిట్ల కోసం ఎదురుచూసేవారు కూడా ఉన్నారు. అయితే ఇటీవల హైపర్ ఆది గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఓ టీవీ సెలబ్రెటీని పెళ్లి చేసుకున్నాడన్న […]

Written By:
  • NARESH
  • , Updated On : July 10, 2021 / 12:51 PM IST
    Follow us on


    జబర్దస్త్ ప్రొగ్రాం ఎంత పాపులారిటీ సాధించిందో అందరికీ తెలుసు. సినిమా కంటే ఎక్కువగా ఈ షోకు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ షో పాపులారిటితో ఇందులోని నటులకు అంతేస్థాయిలో గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా హైపర్ ఆది స్కిట్స్ అంటే నవ్వకుండా ఉండరు. పంచ్ లు, ప్రాసలతో ఆకట్టకునే హైపర్ ఆది టీం స్కిట్ల కోసం ఎదురుచూసేవారు కూడా ఉన్నారు. అయితే ఇటీవల హైపర్ ఆది గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఓ టీవీ సెలబ్రెటీని పెళ్లి చేసుకున్నాడన్న వీడియో బయటికి రావడంతో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఆ కథాకమీషనేంటో చూద్దాం..

    ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రొగ్రాం సినిమాను తలపించేలా ప్రసారం అవుతుంది. ఈ షో లో నటించిన వారు స్థార్ హీరోలతో కలిసి సినిమాల్లో నటించారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు జబర్దస్త్ షో లో ఆకట్టుకుంటున్నారు నటులు. ఇక హైపర్ ఆది చాలా సినిమాల్లో నటించారు. అయినా జబర్దస్త్ షోలో ఢిఫరెంట్ స్కిట్లు చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా హైపర్ ఆదికి సంబంధించిన ఓ ప్రొమో వైరల్ అవుతోంది. ఇందులో ఏముందంటే..?

    హైపర్ ఆది టీవీ నటి దీపికి పిల్లిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లికొడుకు గెటప్లో కనిపించేసరికి అందరూ షాక్ తిన్నారు. ఆ తరువాత ఆయన దీపిక పెల్లిని పెళ్లి చేసుకోవడం చూసి ఆశ్చర్యపోతారు. వీరితో పాటు యూట్యూబ్ స్టార్ జంట సుధీర్, రష్మిలు కూడా పెళ్లి పీటలపై కూర్చుంటారు. రెండు జంటలకు ఓకేసారి పెళ్లవుతుంది. అయితే త్వరలో ప్రసారమయ్యే షో కు సంబంధించిన ప్రోమో ఇలా బయటికి రావడంతో ఆదికి నిజంగానే పెళ్లయిందా..? అని అనుకుంటున్నారు.

    జబర్దస్త్ ప్రొగ్రాం కు సంబంధించి నిత్యం ట్విస్టుల మీద ట్విస్టులుంటాయి. లెటేస్ట్ గా హైపర్ ఆది ట్విస్ట్ మాత్రం వైరల్ అవుతోంది. ఎప్పటి నుంచి హైపర్ ఆది పెళ్లి పై రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రోమోను చూసి హైపర్ ఆదికి నిజంగానే పెళ్లయిందన్న షాక్లో ఉన్నారు. అయితే హైపర్ ఆది ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నాడనేది మాత్రం షోలో చూడాల్సిందేనంటున్నారు.