Hyper Aadi: పెళ్ళై పిల్లలు ఉన్న అమ్మాయితో హైపర్ ఆది పెళ్లి… మేటర్ లీక్ చేసిన జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్ షోతో అనతి కాలంలో ఫుల్ క్రేజ్ సంపాదించాడు హైపర్ ఆది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్నాళ్లుగా ఆయన జబర్దస్త్ కి దూరం అయ్యాడు. అయితే ఈ టీవిలో ప్రసారమవుతున్న శ్రీ దేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలలో తన కామెడీ పంచులతో అలరిస్తున్నాడు.

Written By: S Reddy, Updated On : March 22, 2024 1:12 pm

Hyper Aadi

Follow us on

Hyper Aadi: హైపర్ ఆది బుల్లితెర పై స్టార్ కమెడియన్ గా హవా సాగిస్తున్నాడు. థర్టీ ప్లస్ లో ఉన్న హైపర్ ఆది పెళ్లి గురించి తరచుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హైపర్ ఆది పెళ్ళికి రెడీ అయినట్లు తెలుస్తుంది. పెళ్లంటే అమ్మాయితో కాదు .. పెళ్ళై పిల్లలు ఉన్న మహిళని చేసుకోబోతున్నాడట. ఈ విషయం తెలిసిన ఆయన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతటి ఫేమ్ ఉన్న హైపర్ ఆది పెళ్లైన మహిళను వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

జబర్దస్త్ షోతో అనతి కాలంలో ఫుల్ క్రేజ్ సంపాదించాడు హైపర్ ఆది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్నాళ్లుగా ఆయన జబర్దస్త్ కి దూరం అయ్యాడు. అయితే ఈ టీవిలో ప్రసారమవుతున్న శ్రీ దేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలలో తన కామెడీ పంచులతో అలరిస్తున్నాడు. లేటెస్ట్ శ్రీ దేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో నాన్ స్టాప్ పంచులతో నవ్వులు పూయించాడు. ఈ క్రమంలో అందరిపై సెటైర్లు వేశాడు. ఇంతలో నరేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఆదికి అదిరిపోయే పంచ్ పేల్చాడు.

ఏయ్ తమ్ముడు .. ఏయ్ తమ్ముడు అని అని హైపర్ ఆదిని నరేష్ పిలిచాడు. దీంతో హైపర్ ఆది ఏంట్రా .. నేను నీకు తమ్ముడు ఏంట్రా .. నువ్వే నా తమ్ముడివి అంటాడు. ఒకే అన్న .. నువ్వు ఫ్యూచర్ లో ఏం కావాలనుకుంటున్నావు అని నరేష్ అడగ్గా .. ఓ మంచి తండ్రిని అవ్వాలి అనుకుంటున్నా అని హైపర్ ఆది చెప్పాడు. నువ్వు ఫాదర్ ఏంటన్నా .. స్టెప్ ఫాదర్ అవుతావు కానీ అని నరేష్ పంచ్ వేసాడు. దీంతో సెట్ మొత్తం నవ్వులతో హోరెత్తింది.

నరేష్ చేసిన ఈ కామెంట్స్ కామెడీలో భాగమే. అయితే ఆది పెళ్ళైన అమ్మాయిని అందులోనూ పిల్లలు ఉన్న ఆమెను చేసుకుంటున్నాడా అని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. గతంలో కూడా హైపర్ ఆది ఓ అమ్మాయి ని ప్రేమిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. శ్రీ దేవి డ్రామా కంపెనీ స్టేజి పై ఆమెను అందరికీ పరిచయం చేసాడు. ఆ అమ్మాయికి అందరి ముందు ప్రపోజ్ కూడా చేశాడు. కానీ తర్వాత మళ్లీ ఆమె ఊసు ఎత్తలేదు. కేవలం అదంతా షో టీఆర్పీ కోసం చేశాడు. ఇప్పుడు చేసిన కామెడీ కూడా అలాంటిదే.