Hyper Aadi: హైపర్ ఆది పేరు వింటే చాలు పంచుల వర్షం వస్తుంది. మాట మాటకో పంచ్ వేస్తూ జబర్దస్త్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లిన కళాకారుడు. అతడు వేసే పంచుల కోసమే ప్రజలు జబర్దస్త్ కు ఆకర్షితులయ్యారు. కానీ కొద్ది రోజులుగా జబర్దస్త్ లో ఆది కనిపించడం లేదు. దీంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. ఆది లేని జబర్దస్త్ ను చూడటానికి ఇష్టపడటం లేదు. హైపర్ ఆది ఉంటేనే దానికి నిండుదనం వస్తుందనే ఉద్దేశంతో అందరు గురువారం వచ్చిందంటే చాలు టీవీల ముందు కూర్చునేవారు. గత కొద్ది రోజులుగా జబర్దస్త్ షో లో హైపర్ ఆది కనిపించడం లేదు. దీంతో ఏం జరిగిందనే దానిపై కూడా క్లారిటీ లేదు. ఆది వస్తాడో లేదో కూడా తెలియదు. మొత్తానికి హైపర్ ఆది జబర్దస్త్ నుంచి దూరం జరిగినట్లు వార్తలు మాత్రం వస్తున్నాయి.

జబర్దస్త్ తోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోల్లో కూడా ఆది తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. సంచుల కొద్ది పంచులు వేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆది వేసే పంచులకు అంతా కడుపుబ్బ నవ్వుకుంటారు. దీంతో ఆదికి ఈటీవీ ప్రాధాన్యం బాగానే ఇస్తున్నా ఎందుకో జబర్దస్త్ కు మాత్రం గుడ్ బై చెప్పినట్లు వార్తలు రావడం గమనార్హం. ప్రతి వారం ఆదివేసే పంచులకు అంతా ఫిదా కావడం ఖాయమే. కానీ కొద్ది రోజులుగా ఆది పంచులు లేక జబర్దస్త్ షో వెలవెలబోతోంది.
Also Read: Daddy Movie Child Artist: డాడీ సినిమాలో చిన్నారి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
శ్రేదేవి డ్రామా కంపెనీ, ఢీ షోల్లో మాత్రం ఆది రెచ్చిపోతున్నాడు. పవర్ ఫుల్ పంచులతో అందరిని నవ్విస్తున్నాడు. తాజాగా ఢీ షోలో ఆది చేసిన స్కిట్ కు సంబంధించిన ప్రోమోలో ఆది తన స్టైల్ లో పంచుల వరద పారించాడు. స్టేజీ మీద తనకు పెళ్లయిందని పిల్లలున్నారని తేజును తన భార్యగా పరిచయం చేశాడు. ఇక వారి కామెడీకి అందరు నవ్వుకున్నారు. ఈ డాడీ మాకొద్దు మార్చేద్దామని పిల్లలు అంటే తేజు నేను అదే ఆలోచిస్తున్నాను ఏం చేద్దామని? అని అంటుంది. దీంతో హాస్యం పండింది.

మళ్లీ ఆది కలుగజేసుకుని ఏంటే ఏం ఆలోచిస్తున్నావని ప్రశ్నిస్తే కుక్కర్ విజిల్స్ వేయడం లేదని తేజు చెబుతుంది. దానికి ఆది గణేష్ మాస్టర్ ను అడుగు అయిదు విజిల్స్ వేస్తాడు అని కౌంటర్ ఇవ్వడంతో అందరు పకపక నవ్వుతారు. ఆది సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు అందరు ఫిదా కావాల్సిందే. అంతటి సమయస్ఫూర్తి ఆదిలో ఉంటుంది. అందుకే ఆది అంటే అందరు ఇష్టపడతారు. అతడి పంచుకంత పవర్ ఉంటుంది. జబర్దస్త్ షో కు దూరమైనా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోల్లో తన సత్తా చాటుతున్నాడు. ప్రేక్షకులను నవ్విస్తున్నాడు. తన పంచులతో నవ్వుల పూలు పూయిస్తున్నాడనడంలో సందేహం లేదు.
Also Read:Senior Heroine Malavika: ఫేడ్ అవుట్ హీరోయిన్ కి సడెన్ గా క్రేజ్.. కారణం ఆయనే !
[…] Also Read: Hyper Aadi: హైపర్ ఆది సంచలనం.. స్టేజ్ మీద భార్… […]