Hyper Aadi: గత 12 ఏళ్ళ నుండి ఈటీవీ లో ప్రసారం అవుతున్న ‘జబర్దస్త్’ కామెడీ షోలో అత్యధిక శాతం మంది పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ అనే సంగతి ప్రతికేయించి చెప్పనవసరం లేదు. కొంతమంది చిన్న తనం నుండి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫ్యాన్స్ అయితే, మరికొంతమంది ఆ షో కి జడ్జీ గా వ్యవహరించిన నాగబాబు మీద గౌరవం తో ఎన్నికల సమయం లో పవన్ కళ్యాణ్ వైపు ఉండేవారు. ముఖ్యంగా హైపర్ ఆది గురించి మాట్లాడుకోవాలి. ఇతను చిన్న తనం నుండే పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. అప్పట్లో కత్తి మహేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేస్తూ మీడియా చానెల్స్ లో ఏ రేంజ్ లో రెచ్చిపోయాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జనసేన పార్టీ నాయకులూ ఈ వ్యవహారం లో ఎంత జోక్యం చేసుకున్నారో తెలియదు కానీ, హైపర్ ఆది(Hyper Aadi) మాత్రం బాగా జ్యోక్యం చేసుకున్నాడు.
కత్తి మహేష్ కి నాన్ స్టాప్ గా కౌంటర్లు ఇస్తూండేవాడు. సినీ రంగం లో యాక్టీవ్ గా ఉంటూ, ఒక పార్టీ కి బలమైన స్టాండ్ తీసుకోవాలంటే ఎవరైనా భయపడతారు. ఎందుకంటే రేపు పవర్ లోకి అవతల వాళ్ళు వస్తే చాలా డేంజర్, మనకు కెరీర్ ఉండదు అనే భయం ఉంటుంది . కానీ హైపర్ ఆది పవన్ కళ్యాణ్ పై ఎవరైనా అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే, వెంటనే రెస్పాన్స్ ఇస్తూ, వాళ్ళని టీవీరంగా ఎండగట్టేవాడు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ వంటి వారు కూడా జనసేన పార్టీ తరుపున గడిచిన రెండు ఎన్నికల్లో బాగా ప్రచారం చేశారు, కానీ ఏనాడు కూడా అవతల పార్టీ నాయకుల పై విమర్శలు చేసేవాళ్ళు కాదు. కేవలం పవన్ కళ్యాణ్ కి ఓటు వెయ్యమని మాత్రమే అడిగేవారు. కానీ హైపర్ ఆది అలా కాదు, పవన్ కళ్యాణ్ వైపు ఎవరైనా వేలెత్తి చూపిస్తే ఆ వేలు విరిచేలాగా తన ప్రసంగాలతో కౌంటర్లు ఇచ్చేవాడు.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే హైపర్ ఆది కిసిక్ టాక్స్ అనే షో కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘సినీ రంగం లో యాక్టీవ్ గా ఉంటూ ఒక పార్టీ కి సపోర్ట్ గా ఉంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాలి ఉంటుంది. ఇప్పుడే కాదు, నేను చదువుకునే రోజుల్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను, ఒక పది సీనియర్లు నన్ను పైకి పిలిచి ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఈ బిల్డింగ్ మీద నుండి తోసేస్తాం అని బెదిరించేవాళ్ళు’ అంటూ చెప్పుకొచ్చాడు హైపర్ ఆది. ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.