Bayilone Ballipalike Song: మధ్య కాలం లో తెలుగు సినిమాల్లోని పాటలకంటే, తెలంగాణ జానపద పాటలకు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడాన్ని మనమంతా గమనిస్తూనే ఉన్నాం. ‘రాను బొంబాయి కి రాను ‘ అనే పాట 700 మిల్లియన్లకు పైగా వ్యూస్ ని సాధించింది అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఇలాంటి పాటలకు ఆడియన్స్ నుండి ఎలాంటి ఆదరణ ఉంది అని చెప్పడానికి. రీసెంట్ సమయం లో ప్రముఖ తెలంగాణ సింగర్ మంగ్లీ పాడిన ‘బాయిలోనే బల్లి పలికే'(Baayilone Balli Palike) పాడిన పాట యూట్యూబ్ లో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా ఈ పాటనే కనిపిస్తుంది. ఏ టీవీ షో లో చూసిన మంగ్లీ ఈ పాట ని ప్రమోట్ చేస్తూ తిరుగుతోంది. నెలరోజుల క్రితం అప్లోడ్ చేసిన ఈ పాటకు ఇప్పటి వరకు 62 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
రాబోయే రోజుల్లో ఈ పాట కచ్చితంగా 100 మిలియన్ వ్యూస్ ని కూడా అందుకోబోతుంది. అయితే సోషల్ మీడియా లో ఉన్న నెటిజెన్స్ ఎంత హుషారు అనే సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆవలిస్తే, నిన్న రాత్రి తిన్న అన్నంలో ఏ నూనె పదార్థాలు వాడారో కూడా చెప్పేయగలరు, అంతటి సమర్థులు. తమన్, అనిరుద్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి సంబంధించిన పాటలు విడుదలైనప్పుడు, వాళ్ళు ఎక్కడ నుండి కాపీ కొట్టి తీసుకొచ్చారో క్షణాల్లో చెప్పేస్తూ ఉంటారు. ఈ ‘బాయిలోనే బల్లి పలికే’ పాట కూడా కాపీనే. 2021 వ సంవత్సరం లో మరాఠి లో ఒక పాట వచ్చింది. ఈ పాట ట్యూన్ ని డిట్టో దింపేశారు. ఆ వీడియో ని మీరు క్రింద చూడొచ్చు. కేవలం ట్యూన్ ని మాత్రమే కాదు , ఆ పాటలోని స్టెప్పులు కూడా కాపీ కొట్టారు.
ఈ వీడియో క్రింద నెటిజెన్స్ కామెంట్స్ చూస్తే, ఆ పాట కాపీ నే అయ్యుండొచ్చు, కానీ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం, మంగ్లీ అద్భుతమైన గాత్రమే అని అంటున్నారు. మరి కొంతమంది అయితే ఈ పాటని మంగ్లీ నుండి కాపీ కొట్టి నాలుగు రోజుల క్రితమే అప్లోడ్ చేశారు. మంగ్లీ కాపీ కొట్టలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యూట్యూబ్ లోకి వెళ్లి ‘నవరా మజా దారుడ్య ‘ అని వెతికితే నాలుగు రోజుల క్రితం ఇదే ట్యూన్ తో, ఇదే స్టెప్పులతో వీడియో ని అప్లోడ్ చేసి ఉన్నారు. మరి ఈ వీడియో 2021 లో కంపోజ్ చేసిన ట్యూన్ ని ఇప్పుడు వాడుతూ డ్యాన్స్ చేశారా?, లేదా మంగ్లీ పాటనే కాపీ కొట్టారా అనేది తెలియాల్సి ఉంది.
View this post on Instagram