https://oktelugu.com/

Hyper Aadi: రోజాపై హైపర్ ఆది సంచలన కామెంట్స్… ఎన్నికల్లో ఆమె ఓటమి తర్వాత ఫస్ట్ టైం ఓపెన్ అయిన స్టార్ కమెడియన్!

మాజీ మంత్రి రోజాతో హైపర్ ఆదికి గొప్ప అనుబంధం ఉంది. ఏళ్ల తరబడి వీరిద్దరూ జబర్దస్త్ లో పని చేశారు. కాగా రాజకీయంగా రోజా, హైపర్ ఆది భిన్న ధృవాలు. గత ఎన్నికల్లో జనసేన తరపున హైపర్ ఆది ప్రచారం చేశాడు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రోజా ఓటమి చవి చూసింది. ఎన్నికల ఫలితాల అనంతరం హైపర్ ఆది మొదటిసారి రోజాను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : August 3, 2024 / 05:30 PM IST
    Hyper Aadi

    Hyper Aadi

    Follow us on

    Hyper Aadi: హైపర్ ఆది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఈ విషయం అందరికీ తెలిసిందే. 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో జనసేన తరపున హైపర్ ఆది ప్రచారం చేశాడు. జబర్దస్త్ స్టార్ కమెడియన్స్ పవన్ కళ్యాణ్ కి మద్దతుగా పిఠాపురంలో క్యాంపైన్ నిర్వహించారు. ఆ సమయంలో మాజీ మంత్రి రోజా జబర్దస్త్ కమెడియన్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా నిలబడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారని భయపడి వాళ్ళు జనసేన కి సపోర్ట్ చేస్తున్నారు. అంతే కానీ వాళ్లకు జనసేన అంటే ప్రత్యేక అభిమానం లేదని రోజా వ్యాఖ్యలు చేసింది. రోజా ఆరోపణలకు జబర్దస్త్ కమెడియన్స్ గట్టిగానే కౌంటర్లు వేశారు. కాగా ఎన్నికల తర్వాత ఫస్ట్ టైం ఆది, రోజా గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

    ఊహించని విధంగా రోజా పై ఆది కామెంట్స్ ఉన్నాయి. ఇటీవల ఓ చిట్ చాట్ లో మాట్లాడిన హైపర్ ఆది రోజా వల్లే నేను ఇంతటి స్థాయిలో ఉన్నాను అని షాక్ ఇచ్చాడు. ఏపీ ఎన్నికల సమయంలో జనసేన గెలుపు కోసం ఆది చాలా కష్టపడ్డాడు.

    పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ప్రచార కార్యక్రమాలు, సభలు నిర్వహించాడు. ఆది ఇన్వాల్వ్మెంట్ చూసి ఆయనకు పదవులు వస్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆది దీనిపై క్లారిటీ ఇచ్చాడు. మీకు ఎమ్మెల్యే పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. మరి ఎందుకు ఇవ్వలేదు అని యాంకర్ ప్రశ్నించారు. నా పెళ్ళి గురించి రూమర్స్ ఎలా వస్తుంటాయో .. ఇది కూడా అలాంటిదే.

    నా పైన అభిమానంతోనో లేక యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ పెట్టుకోవడానికో ఇలాంటివి ప్రచారం చేస్తారు. నేను స్వచ్చందంగా పవన్ కళ్యాణ్ పై అభిమానంతో ప్రచారం చేశాను, అని ఆది అన్నారు. ఈ క్రమంలో రోజాపై మీ అభిప్రాయం ఏంటి అని యాంకర్ అడిగారు. రోజాకి జగన్ అంటే ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఎవరి ఇష్టాలు వారివి. కానీ జబర్దస్త్ జడ్జిగా ఆమె అంటే నాకు ఎప్పుడూ గౌరవమే. నాలాగా చాలా మంది ఆర్టిస్టులకు ఇంతటి పేరు వచ్చిందంటే కారణం ఆమెనే. రోజా గారిపై ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ ఉంటుంది. రాజకీయంగా తాము వేరైనా కాని వ్యక్తిగతంగా రోజా అంటే ఇష్టమే అన్నట్లు హైపర్ ఆది పరోక్షంగా వెల్లడించాడు.

    అందరూ పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు. నాకు చాలా సార్లు టీవీ షోల్లో పెళ్లి అయిపోయింది. యూట్యూబ్ లో పిచ్చి పిచ్చిగా చేశారు. రియల్ లైఫ్ లో పెళ్లికి ఇంకా టైం ఉంది. కానీ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న బాగుంటుంది. దాన్ని కొన్నాళ్ళు కంటిన్యూ చేద్దాం అని ఆది చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఆది సినిమాలు, బుల్లితెర షోలతో సందడి చేస్తున్నాడు. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు చేస్తూ అలరిస్తున్నాడు.