Citroen Basalt Coupe: భారతీయ ఆటోమోబైల్ మార్కెట్లో కార్ల సేల్స్ ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ కంపెనీలే కాకుండా ఫారిన్ సంస్థలు ఇక్కడ కొత్త కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి. ఏడాది కాలంగా కార్ల వినియోగం విపరీతంగా పెరిగింది. దాదాపు మిడిల్ క్లాస్ పీపుల్స్ సొంతంగా కారు ఉండాలని అనుకుంటున్నారు. ఇదే సమయంలో కొన్ని ఖరీదైన కార్లు సైతం మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా ఫ్రాన్స్ కు చెందిన సిట్రియెన్ కంపెనీకి చెందిన బసాల్ట్ కారు వివరాలకు సిట్రియెన్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రిలీజ్ చేసింది. లేటేస్టుగా అధికారికంగా కారు వివరాలను బయటపెట్టింది. అయితే కారు లాంచ్ వివరాలను మాత్రం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో సిట్రియెన్ బసాల్ట్ కారు ఫీచర్స్, ఇంజిన్ చూని వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. సిట్రియెన్ నుంచి ఇప్పటికే సీ3, సీ3 ఎయిర్ క్రాస్ వంటి కార్లు భారత మార్కెట్లోకి వచ్చి ఆకర్షించాయి. ఇప్పుడు బసాల్ట్ కూడా ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు. అయితే కారు గురించి తెలిసిన చాలా మంది విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ధర విషయంలోనూ తెలపలేదు. కానీ ఒక అంచనాకు వస్తున్నారు. అయినా బసాల్ట్ గురించి తెలుసుకున్న వారు బుకింగ్ తేదీ కోసం రెడీ అవుతున్నారు. అయితే బసాల్ట్ ఫీచర్స్, ఇంజిన్ పనితీరు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఇవి ఎలా ఉన్నాయో వివరాల్లోకి వెళ్దాం..
సిట్రియెన్ బసాల్ట్ కారు ఇంజిన్ ఫీచర్స్ పై కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ కారు ఫీచర్స్ అద్భుతం అని కొనియాడుతున్నారు. ఈ కొత్త మోడల్ ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉంది. ఎస్ యూవీ కూపే లుక్ వచ్చే విధంగా తయారు చేశారు. హెడల్ లైట్ సెటప్, స్పిట్ డీఆర్ఎస్, ఆకట్టుకునే బానెట్, రూఫ్ లైన్ ను అమర్చారు. డ్యూయెల్ అల్లాయ్ వీల్స్ మంచి లుక్ ఇస్తోంది. ఇది అచ్చం ఇప్పటికే రిలీజ్ అయిన సీ3ని పోలి ఉండి.. బ్లాక్ అవుట్ బంపర్ ను కూడుకొని ఉంటుంది. ఎల్ ఈడీ టెయిల్ లైట్స్ అదనంగా ఈ కారులో సెట్ చేశారు. ఇంటీరియర్ లో 10.2 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిజిటల్ క్లస్టర్, వైర్ లెస్ ఆండ్రాయిడ్, ఆపిల్ తో పాటు ఆండ్రాయిడ్ కార్ ప్లే, ఫుష్ బటన్, క్రూయిజ్ కంట్రోల్ ఇందులో కనిపిస్తాయి. క్యాబిన్ మొత్తం ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది.
బసాల్ట్ ఇంజిన్ విషయానికొస్తే.. ఇందులో 1.2 లీటర్ ఇంజిన్, 1.2 లీరట్ టర్బో ఇంజిన్ మొత్తం రెండు ఇంజన్లు ఉన్నాయి. ఈ ఇంజిన్ 82 బీహెచ్ పీ పవర్, 115 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి లీటర్ పెట్రోల్ కు 18.7 నుంచి 19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి. 6 స్పీడ్ మాన్యువల్ తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తాయి. ఇందులో సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అమర్చారు.
ఈ కారు ధరర గురించి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ రూ. 10 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు.ఈ కారు మార్కెట్లోకి వస్తే టాటా కర్వ్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. టాటా కర్వ్ ఆగస్టు 7న మార్కెట్లోకి రాబోతుంది. అయితే అంతకంటే ముందే బసాల్ట్ వస్తుందా? లేదా తరువాత ఉంటుందా? అనేది తెలియాలి.