
క్రిస్మస్ సందర్భంగా హీరో నాని ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ ఇచ్చారు. నాని తన లేటెస్ట్ మూవీ టక్ జగదీశ్ ఫస్ట్ లుక్ విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశాడు దర్శకుడు. నీట్ గా టక్ ఇన్ లో ఉన్న నాని సీరియస్ గా, కత్తిపట్టుకొని ఉన్నారు.వేట కూరతో భోజనం చేస్తున్న నానికి వేట కొడవలి అవసరం ఏమొచ్చింది అన్నట్లు ఆ పోస్టర్ డిజైన్ చేశారు. టక్ జగదీష్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాని లుక్ మరియు నేపథ్యం చూస్తుంటే.. మూవీ రాయలసీమ బ్యాక్ గ్రౌండ్ లో సాగుతుందా అనే అనుమానం కలుగుతుంది. ఏది ఏమైనా ఫస్ట్ లుక్ తో మూవీపై ప్రేక్షకులకు ఆసక్తి కలిగించడంలో దర్శకుడు శివ నిర్వాణ సక్సెస్ అయ్యారు.
శివ నిర్వాణ గత చిత్రాలు రెండు మంచి విజయాలు సాధించాయి. ఆయన డెబ్యూ మూవీ నిన్ను కోరిలో నాని హీరోగా నటించారు. ఇక గత ఏడాది నాగ చైతన్య హీరోగా విడుదలైన మజిలీ మంచి విజయాన్ని అందుకుంది. మూడో చిత్రంగా శివ నిర్వాణ టక్ జగదీష్ తెరకెక్కిస్తున్నారు. విజయాల పరంగా వెనుకబడ్డ నాని ఈ ప్రాజెక్ట్ పై చాలా అశలే పెట్టుకున్నారు. నాని లేటెస్ట్ రిలీజ్ ‘వి’ భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది. దీనితో టక్ జగదీష్ తో హిట్ కొట్టి మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారు.
రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు కీలక రోల్ చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షైన్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. యంగ్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా నాని మరో రెండు చిత్రాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి అనే మరో రెండు చిత్రాలు నాని చేయాల్సి వుంది. అంటే సుందరానికి చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించనున్నారు.