https://oktelugu.com/

AP Govt: ఏపీ సర్కార్ కు భారీ జరిమానాలు.. షాక్ లాగా

AP Govt: మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు అసలే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు జరిమానాల గోల ఎక్కువైంది. దీంతో మింగలేక కక్కలేక అన్న చందంగా ఆందోళనకు గురవుతోంది. ఏకంగా రూ. 120 కోట్ల జరిమానా కట్టాలంటే మాటలు కాదు. ముందు చూపు లేకపోతే ఇలాగే ఉంటుందని పలువురు విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. అసలే రాష్ర్టం పీకల్లోతు అప్పుల్లో ఉండగా ఇప్పుడు ఈ భారం ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరో చేసిన దానికి మూల్యం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 3, 2021 12:52 pm
    Follow us on

    AP Govt: మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు అసలే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు జరిమానాల గోల ఎక్కువైంది. దీంతో మింగలేక కక్కలేక అన్న చందంగా ఆందోళనకు గురవుతోంది. ఏకంగా రూ. 120 కోట్ల జరిమానా కట్టాలంటే మాటలు కాదు. ముందు చూపు లేకపోతే ఇలాగే ఉంటుందని పలువురు విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. అసలే రాష్ర్టం పీకల్లోతు అప్పుల్లో ఉండగా ఇప్పుడు ఈ భారం ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరో చేసిన దానికి మూల్యం చెల్లించడమంటే ఇదే.

    AP Govt

    AP Govt

    అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాలుష్య నియంత్రణ మండలి రూ.120 కోట్ల జరిమానా విధించింది. దీంతో రాష్ర్ట అధోగతి పాలవుతుందని తెలుస్తోంది. పురుషోత్తమ పట్నంకు రూ. 24 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.24 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు రూ.73 కోట్ల జరిమానా విధిస్తూ ఎన్జీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ పరిస్థితి డైలమాలో పడిపోతోంది.

    Also Read: పిటిషన్లతో ప్లాన్ చేస్తున్నారు.. కొలిక్కిరాని వివేకా కేసు

    వాస్తవానికి ఈ ప్రాజెక్టులన్ని పోలవరం ప్రాజెక్టులో భాగమేనని చెబుతున్నా ఎన్టీటీ వినిపించుకోవడం లేదు. పర్యావరణ అనుమతులు తీసుకోలేదనే నెపంతో ప్రభుత్వానికి భారీ జరిమానా విధించేందుకు సంకల్పించింది. దీంతో ఏపీ ఆందోళన చెందుతోంది. అప్పుల ఊబిలో చిక్కిన రాష్ర్టం ఇప్పుడు జరిమానాతో కుదేలయిపోతోంది.

    ప్రభుత్వం మాత్రం పోలవరంలో భాగంగానే ఈ ప్రాజెక్టులు కడుతున్నట్లు చెబుతున్నా దాన్ని ఎన్జీటీ పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రభుత్వం చిక్కుల్లో పడుతోంది. సరైన సూచనలు, సలహాలు లేకే జగన్ ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది. జరిమానాలు కట్టడానికే నిధులు ఖర్చు చేస్తే పనులు ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ఏపీని గట్టెక్కించే దారులు మాత్రం కనిపించడం లేదని తెలుస్తోంది.

    Also Read: ఏపీలో కమ్మ సామాజిక వర్గం ఒకటవుతుందా?

    Tags