https://oktelugu.com/

ప్లాప్ హీరోయిన్ కి భారీ ఆఫర్స్ !

టాలెంట్ ను అలాగే గ్లామర్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ఎప్పుడో స్టార్ హీరోయిన్ గా అనూ ఇమాన్యుల్, ఇప్పటికే అందరి స్టార్ హీరోలతో జతకట్టేది. కానీ, అదృష్టం లేక సక్సెస్ ట్రాక్ లోకి వెళ్ళలేక మొత్తానికి అనూ ఇమాన్యుల్ మాత్రం స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కెరీర్ లో చెప్పుకోవటానికి మంచి హిట్ లేకపోవడంతో.. అనూ ఇమాన్యుల్ కెరీర్ ఆశించిన స్థాయిలో టాలీవుడ్ లో ఊపందుకోలేదు. దానికి తోడు సరైన ప్లానింగ్ లేకపోవడం కూడా అనూని వెనక్కి […]

Written By:
  • admin
  • , Updated On : August 30, 2020 / 05:02 PM IST
    Follow us on


    టాలెంట్ ను అలాగే గ్లామర్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే ఎప్పుడో స్టార్ హీరోయిన్ గా అనూ ఇమాన్యుల్, ఇప్పటికే అందరి స్టార్ హీరోలతో జతకట్టేది. కానీ, అదృష్టం లేక సక్సెస్ ట్రాక్ లోకి వెళ్ళలేక మొత్తానికి అనూ ఇమాన్యుల్ మాత్రం స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కెరీర్ లో చెప్పుకోవటానికి మంచి హిట్ లేకపోవడంతో.. అనూ ఇమాన్యుల్ కెరీర్ ఆశించిన స్థాయిలో టాలీవుడ్ లో ఊపందుకోలేదు. దానికి తోడు సరైన ప్లానింగ్ లేకపోవడం కూడా అనూని వెనక్కి నెట్టేసింది.

    Also Read: వెబ్‌ సిరీస్‌లో రేణు దేశాయ్‌ ‘ఆహా’ అనిపిస్తుందా?

    బహుశా అందుకే బన్నీతో చేశాక కూడా భారీ అవకాశాలు రాలేదు. కానీ, ఆ మధ్య తన కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లదామని అనూ ఇమాన్యుల్ గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టినా స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్స్ లను మాత్రం సాధించలేకపోయింది. కెరీర్ స్టార్టింగ్ లో స్టార్స్ తో తప్ప చిన్న హీరోలతో చెయ్యనని.. అలాగే ఎంత పెద్ద స్టార్ సినిమానైనా తన పాత్ర సినిమాలో కీలకంగా ఉండాలని ఇలా ఓవర్ బిల్డప్ ఇచ్చి ఛాన్స్ లు పోగొట్టుకుంది. లేకపోతే గీతగోవిందం లాంటి సినిమా మిస్ అయ్యేది కాదు. ఆ సినిమా ఆఫర్ మొదట అనూకే వెళ్ళింది. చిన్న హీరోతో చెయ్యను అని, అల్లు అరవింద్ గారి కోసం గెస్ట్ రోల్ చేస్తానని ఆ సినిమాలో ఒక చిన్న రోల్ చేసింది. దాంతో పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి.

    Also Read: నెట్టింట్లో ‘ఆంటీ’ ఐటమ్ సాంగ్ వైరల్

    అయితే, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమాలో ప్లాప్ హీరోయిన్ గా ముద్ర పడ్డ అనూ ఇమాన్యుల్ నే హీరోయిన్ గా తీసుకోవాలని అల్లు కాంపౌండ్ నుండి రికమండేషన్ వెళ్లిందని.. దాంతో హరీష్ శంకర్ ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని ఆలోచిస్తోన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’కి సీక్వెల్ గా చేస్తోన్న ‘బంగార్రాజు’లో కూడా అనూ ఇమాన్యుల్ నే హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. మొత్తానికి అనూ ఇమాన్యుల్ కి అవకాశాలు పెరుగుతున్నాయి.