https://oktelugu.com/

త‌న‌యుడి సినిమాలో హీరోగా స్టార్ హీరో !

భార‌తీయ సినీ రంగంలో సినీ వార‌సులే ఎక్కువుగా హీరోల‌య్యారు. కాకపోతే, వారిలో కొంతమందే స్టార్ డమ్ తెచుకున్నారు అనుకోండి. అయితే, స్టార్ హీరోలు తమ కొడుకులతో కలిసి నటించడం అనేది ఎన్టీఆర్ – బాలయ్య, నాగేశ్వరరావు – నాగార్జున సినిమాల నుండే ఆనవాయితీగా వస్తోంది. ఆ తరువాత కాలంలో కూడా తండ్రికొడుకుల కాంబినేష‌న్ల‌లో బోలెడ‌న్ని సినిమాలు వ‌చ్చాయి. కానీ విచిత్రంగా ఆ సినిమాల వల్ల కొడుకులకు పెద్దగా ప్రయోజనం జరిగింది అయితే ఏమిలేదు. ఆ తరువాత కొందరి […]

Written By:
  • admin
  • , Updated On : August 30, 2020 / 05:44 PM IST
    Follow us on


    భార‌తీయ సినీ రంగంలో సినీ వార‌సులే ఎక్కువుగా హీరోల‌య్యారు. కాకపోతే, వారిలో కొంతమందే స్టార్ డమ్ తెచుకున్నారు అనుకోండి. అయితే, స్టార్ హీరోలు తమ కొడుకులతో కలిసి నటించడం అనేది ఎన్టీఆర్ – బాలయ్య, నాగేశ్వరరావు – నాగార్జున సినిమాల నుండే ఆనవాయితీగా వస్తోంది. ఆ తరువాత కాలంలో కూడా తండ్రికొడుకుల కాంబినేష‌న్ల‌లో బోలెడ‌న్ని సినిమాలు వ‌చ్చాయి. కానీ విచిత్రంగా ఆ సినిమాల వల్ల కొడుకులకు పెద్దగా ప్రయోజనం జరిగింది అయితే ఏమిలేదు. ఆ తరువాత కొందరి స్టార్లు కొడుకుల సినిమాలను ప్రమోట్ చేయడానికి మెగాస్టార్, ముమ్ముట్టి, నాగార్జున లాంటి వాళ్లు త‌మ త‌న‌యుల సినిమాల్లో గెస్ట్ రోల్ లో కనిపిస్తూ ఆయా సినిమాలకు మంచి హైప్ ను తీసుకువచ్చిన సందర్భాలున్నాయి.

    Also Read: బోల్డ్ సీన్స్ కి ‘టబు’ గ్రీన్ సిగ్నల్ !

    ఇక తాజాగా మరో తండ్రీకొడుకుల కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతుంది. పైగా తండ్రీ కొడుకు లిద్దరూ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటిస్తున్నారు. త‌మిళంలో స్టార్ హీరో విక్ర‌మ్, ఆయ‌న త‌న‌యుడు ధ్రువ్ కలకయిలో ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా రూపొంద‌నుంద‌ని.. ఈ సినిమాలో సీనియర్ హీరో కార్తిక్ కూడా మరో కీలక పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తోంది. అన్నట్టు కార్తిక్ సుబ్బరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతుందట. సహజంగా కార్తిక్ సుబ్బ‌రాజ్ అంటేనే మంచి కంటెంట్ ఉంటుందనే నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాడు.

    Also Read: వెబ్‌ సిరీస్‌లో రేణు దేశాయ్‌ ‘ఆహా’ అనిపిస్తుందా?

    మరి అలాంటి డైరెక్టర్ నుండి సినిమా అనేసరికి, పైగా విక్ర‌మ్-ధ్రువ్ ల కలయిక అనేసరికి మొత్తానికి ఈ సినిమా పై సౌత్ సినీ ప్రేక్షకులకు మంచి ఆసక్తి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక అర్జున్ రెడ్డి రీమేక్ తో విక్ర‌మ్ త‌న‌యుడుగా ధ్రువ్ త‌మిళ తెర‌కు ప‌రిచ‌యం అయినా.. ఆ సినిమాతో పెద్దగా స్టార్ డమ్ ను అయితే తెచ్చుకోలేకపోయాడు. దాంతో తన రెండో సినిమాగా తన తండ్రి విక్ర‌మ్ తో కలిసి న‌టించ‌బోతున్నాడు.