https://oktelugu.com/

ఎన్ని సినిమాలయ్యా.. నీది గొప్ప ‘బుర్రా’నయ్యా !

తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం మాటల రచయిత అంటే ఎక్కువగా వినిపించే పేరు ఆయనదే. పెద్ద సినిమా ఏదైనా స‌రే, ఆ సినిమాకి డైలాగ్ రైట‌ర్ మాత్రమే ఆయనే. ఆయనే బుర్రా సాయిమాధ‌వ్. చేతిలో ‘ఆర్ఆర్ఆర్, ఆచార్య, బాల‌కృష్ణ – గోపీచంద్ మ‌లినేని సినిమా, పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న రెండు సినిమాలు ఇలా చెప్పుకుంటూ పోతే వందల కోట్లు కొల్లగొట్టే చిత్రాలకు అర్ధవంతమైన శబ్దం ఆయనదే. అయితే తాజాగా మ‌రో క్రేజీ ప్రాజెక్టు సాయిమాధవ్ దరికి చేరింది. […]

Written By:
  • admin
  • , Updated On : July 13, 2021 7:41 pm
    Follow us on

    Sai Madhav Burra Upcoming moviesతెలుగు చిత్రసీమలో ప్రస్తుతం మాటల రచయిత అంటే ఎక్కువగా వినిపించే పేరు ఆయనదే. పెద్ద సినిమా ఏదైనా స‌రే, ఆ సినిమాకి డైలాగ్ రైట‌ర్ మాత్రమే ఆయనే. ఆయనే బుర్రా సాయిమాధ‌వ్. చేతిలో ‘ఆర్ఆర్ఆర్, ఆచార్య, బాల‌కృష్ణ – గోపీచంద్ మ‌లినేని సినిమా, పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న రెండు సినిమాలు ఇలా చెప్పుకుంటూ పోతే వందల కోట్లు కొల్లగొట్టే చిత్రాలకు అర్ధవంతమైన శబ్దం ఆయనదే.

    అయితే తాజాగా మ‌రో క్రేజీ ప్రాజెక్టు సాయిమాధవ్ దరికి చేరింది. మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ – విజువల్ వండర్ డైరెక్టర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత‌. ఈ చిత్రానికి డైలాగ్ రైట‌ర్ గా బుర్రా సాయిమాధ‌వ్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. అసలు బిజీగా ఉన్న సాయిమాధవ్ దగ్గరకే భారీ ప్రాజెక్ట్ చిత్రాలు ఎందుకు వెళ్తున్నాయి ?

    ఏ..? ఇండస్ట్రీలో మరో డైలాగ్ రైటర్ లేరా ? పెద్ద సినిమాలతో పాటు రామ్ – లింగు స్వామి లాంటి మీడియం రేంజ్ సినిమాలకు కూడా బుర్రానే ఏరికోరి డైలాగ్ రైట‌ర్‌ గా పెట్టుకుంటున్నారు. అలాగే నేషనల్ స్టార్ ప్ర‌భాస్ – నాగ అశ్విన్ కలయికలో వస్తోన్న పాన్ ఇండియా సినిమాకి కూడా సాయిమాధ‌వ్ నే డైలాగ్ రైటర్. అసలు చేతిలో ఇన్ని పాన్ ఇండియా సినిమాలు పెట్టుకుని.. అంత కూల్ గా సాయిమాధవ్ ఎలా ఉంటున్నాడో ?

    భారీ ప్రాజెక్టుల‌న్నీ బుర్రాని వెదుక్కుంటూ వెళ్తుంటే.. చిన్నాచితకా చిత్రాల మేకర్స్ బాధగా చూస్తున్నారు. తమ సినిమాకి బుర్రా అందుబాటులో లేడు అని. కానీ చిన్న సినిమాలను కూడా తాను వదలను అంటూ రెండు చిన్న సినిమాలకు కూడా మాటలు రాస్తున్నాడు. డైరెక్టర్ వంశీ ఆకెళ్ళ దర్శకత్వంలో వస్తోన్న ఒక సినిమాకి, అలాగే హీరో వరుణ్ తేజ్ సినిమాకి కూడా సాయి మాధవ్ డైలాగ్స్ అందిస్తున్నాడు. అసలు ఎన్ని సినిమాలయ్యా.. నీది గొప్ప ‘బుర్రా’నయ్యా సాయిమాధవ్.