https://oktelugu.com/

అనసూయ భర్తపై షాకింగ్ కామెంట్స్

చక్కనమ్మ చిక్కినా అందమే అన్నారో సినీకవి. అందమైన ముద్దుగుమ్మలు ఏం చేసినా అది సంచలనమే. సామాజిక మాధ్యమాలు కొత్త పుంతలు తొక్కుతున్న క్రమంలో పలు ఫొటోలతో కుర్రాళ్లకు మత్తెక్కించటం మామూలే. తాజాగా జబర్దస్త్ వ్యాఖ్యాత అనసూయ పెట్టిన ఓ పిక్ వైరల్ అవుతోంది. తన భర్త భరద్వాజ్ ను ఉద్దేశిస్తూ పెట్టిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. జబర్దస్త్ లో అనసూయ హంగామా అంతా ఇంతా కాదు. తన వస్ర్తధారణతో కూడా మత్తెక్కించే ఆమె మాటలతో గారడీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 13, 2021 / 07:32 PM IST
    Follow us on

    చక్కనమ్మ చిక్కినా అందమే అన్నారో సినీకవి. అందమైన ముద్దుగుమ్మలు ఏం చేసినా అది సంచలనమే. సామాజిక మాధ్యమాలు కొత్త పుంతలు తొక్కుతున్న క్రమంలో పలు ఫొటోలతో కుర్రాళ్లకు మత్తెక్కించటం మామూలే. తాజాగా జబర్దస్త్ వ్యాఖ్యాత అనసూయ పెట్టిన ఓ పిక్ వైరల్ అవుతోంది. తన భర్త భరద్వాజ్ ను ఉద్దేశిస్తూ పెట్టిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. జబర్దస్త్ లో అనసూయ హంగామా అంతా ఇంతా కాదు. తన వస్ర్తధారణతో కూడా మత్తెక్కించే ఆమె మాటలతో గారడీ చేస్తోంది.

    ఎప్పుడు నెటిజన్లతో బీజీగా ఉంటూ వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్నారు. తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టి ఎప్పుడు తన వైపు ఉండేలా జాగ్రత్తలుతీసుకుంటోంది. వస్ర్తధారణపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోని ఈ బ్యూటీ ప్రైవేటు లైఫ్ ఎవరికో నచ్చినట్లు మలుచుకోవడం ఎందుకని ప్రశ్నిస్తోంది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె తాజాగా తన భర్తను ఉద్దేశిస్తూ పోస్టు చేసింది.

    అనసూయ పలు ఇంటర్వ్యూల్లో భరద్వాజ్ పై ఉన్న ప్రేమను బయటపెడుతూనే ఉంటుంది. ప్రేమించి పెళ్లాడిన అనసూయ తన భర్తే తనకు సర్వస్వం అని చెబుతోంది. భర్తపై ఉన్న ప్రేమను తన ఎదపై పచ్చబొట్టు పొడిపించుకుని చాటుకుంది. పండుగ సందర్భాల్లో భర్త, పిల్లలతో ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో పాలు పంచుకోవడం ఆమెకు అలవాటే.

    ఈ నేపథ్యంలో తాజాగా తన భర్త ఎదపై వాలి చిరునవ్వు చిందిస్తూ ఓ ఫొటో షేర్ చేసింది. దీనిపై ఇంత ఆనందంగా నవ్వుతూ బతుకుంది నీవల్లే. నువ్వు ప్రసాదించిన నవ్వే అది అని ట్యాగ్ చేసి మరోసారి తనలోని ప్రేమను వ్యక్తం చేసింది. దీంతో ఈ పిక్ చూసిన నెటిజన్లు బ్యూటీఫుల్ జోడీ అని కామెంట్లు పెట్టారు. కొందరు మాత్రం స్పందించకున్నా చాలా మంది పిక్ పై పలు సందేశాలు పెట్టారు. దీంతో అనసూయ, భరద్వాజ్ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

    బుల్లితెర, వెండితెరలపై రంగమ్మత్త జోరు మామూలుగా లేదు. జబర్దస్త్ తో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ దూసుకుపోతోంది అనసూయ. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ సినిమాతో పాటు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.