Chandoo Mondeti- Hrithik Roshan: ఈ ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసిన అతి తక్కువ సినిమాలలో ఒకటి యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’..కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి..ఆ అంచనాలకు తగ్గట్టుగానే టీజర్స్ మరియు ట్రైలర్స్ ఉండడం తో తెలుగు లో కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే అనుకున్నారు..కానీ ఈ సినిమా బాలీవుడ్ ని ఊపేస్తాది అని మాత్రం ఎవ్వరు అనుకోలేదు..కేవలం రెండు లక్షల రూపాయిల నెట్ ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే హిందీ లో సుమారు 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను సాధించింది అంటే మాములు విషయం కాదు..హీరో నిఖిల్ తో పాటు ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన చందూ మొండేటి పేరు కూడా జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది..ఇప్పుడు ఈ దర్శకుడితో సినిమాలు చెయ్యడానికి బడా నిర్మాతలందరూ క్యూ కడుతున్నారు..వారిలో ఒకరే అల్లు అరవింద్ గారు.

గీత ఆర్ట్స్ లో ఒక సినిమా చేసేందుకు గాను చందు మొండేటి కి అల్లు అరవింద్ గారు ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చారు..అయితే ఇప్పుడు తన తదుపరి సినిమాని గీత ఆర్ట్స్ లో చెయ్యడానికి ముందుకు వచ్చాడట చందు మొండేటి..కథ మొత్తం రాసుకున్నాను అని..ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టు చందు మొండేటి అల్లు అరవింద్ కి చెప్పాడట..అయితే ఈ సినిమాలో హీరో గా హృతిక్ రోషన్ ని తీసుకుందాం..ఆయనకీ ఈ కథ సరిగ్గా ఉంటుంది..ఒకరోజు ఆయన దగ్గరకి వెళ్లి కథ చెప్పి ఓకే చేయించుకుందాం అని చెప్పాడట అల్లు అరవింద్.

అంటే అతి త్వరలోనే మనం గీత ఆర్ట్స్ లో చందు మొండేటి దర్శకత్వం లో హృతిక్ రోషన్ సినిమాని చూడబోతున్నాం అన్నమాట..హృతిక్ రోషన్ తో ఒక సరైన సినిమా తీస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఏ రేంజ్ బద్దలు అవుతుందో మన అందరికి తెలిసిందే..పైగా పాన్ ఇండియన్ సబ్జెక్టు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో దున్నేసే అవకాశం ఉంది..బాలీవుడ్ లో మొట్టమొదటి వంద కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసిన సినిమాని నిర్మించి సరికొత్త చరిత్ర సృష్టించిన అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్, ఇప్పుడు హృతిక్ రోషన్ తో ఎలాంటి అద్భుతాలు చెయ్యబోతుందో చూడాలి.