Hrithik Roshan : బాలీవుడ్ స్టార్ హీరోలు, కోలీవుడ్ స్టార్ హీరోలు ఈమధ్య కాలంలో మన టాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ ఎక్కువగా రజినీకాంత్(Superstar Rajinikanth), విజయ్(Thalapathy Vijay) వంటి సూపర్ స్టార్స్ తో పాటు మన టాలీవుడ్ పాన్ ఇండియన్ హీరోలతో సినిమాలు చేస్తుండడం వల్ల, వాళ్ళు అత్యధికంగా మన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. ధనుష్(Dhanush), దుల్కర్ సల్మాన్(Dulquer Salman) వంటి వారు ఇదే ఫార్ములా ని అనుసరిస్తున్నారు. ఇప్పుడు హీరో సూర్య కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ఇక బాలీవుడ్ హీరోలు అయితే సౌత్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. డైరెక్టర్ అట్లీ షారుక్ ఖాన్ తో ‘జవాన్’ చిత్రం చేసి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు.
Also Read : డైరెక్టర్ గా మారిన హృతిక్ రోషన్..ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్!
రీసెంట్ గానే మరో సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ AR మురుగదాస్ సల్మాన్ ఖాన్ తో ‘సికిందర్’ అనే సినిమా చేసాడు. కానీ ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. అయినప్పటికీ బాలీవుడ్ డైరెక్టర్స్ కంటే మన సౌత్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడమే ఉత్తమం అని బాలీవుడ్ బడా స్టార్ హీరోలు బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు డైరెక్టర్ బాబీ కి అలాంటి బంపర్ ఛాన్స్ దొరికింది. రవితేజ,జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలను తీసి మంచి ఊపు మీదున్న బాబీ(Director Bobby) త్వరలోనే బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు. రీసెంట్ గానే హృతిక్ ని కలిసి బాబీ ఒక స్టోరీ ని వినిపించాడట. ఆ స్టోరీ హృతిక్ కి చాలా బాగా నచ్చిందని, ఫైనల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసి వినిపిస్తే ఈ సినిమా చేద్దామని హృతిక్ అన్నాడట.
ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతుందని తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ రీసెంట్ గానే తమిళ్ లో తల అజిత్ తో కలిసి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రం చేసింది. ఈ నెల 10న ఆ చిత్రం విడుదల కాబోతుంది. అలాగే బాలీవుడ్ లో గోపీచంద్ మలినేని దర్శకత్వం లో, సన్నీ డియోల్ హీరో గా ‘జాట్’ అనే యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం కూడా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పుడు అదే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో బాబీ, హృతిక్ రోషన్ మూవీ తెరకెక్కబోతుంది. చూడాలి మరి ఈ చిత్రం కమర్షియల్ గా ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది. ‘డాకు మహారాజ్’ చిత్రం కోసం డైరెక్టర్ గా బాబీ తన విశ్వరూపం చూపించేసాడు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఏ హీరో అయినా బాబీ తో పని చేయడానికి నిమిషం కూడా ఆలోచించరు.