Hrithik Roshan and Saba Azad Marriage: హృతిక్ రోషన్ అంటే.. బాలీవుడ్ లో స్టార్ హీరో. అలాంటి స్టార్ హీరో ఒక యంగ్ హీరోయిన్ సబా ఆజాద్ తో ప్రేమలో పడతాడా ? ఇది పుకారు అనుకున్నారు. గతకొంత కాలంగా వీరు తరచూ ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు అని కూడా బాగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ జంట ఆ పుకార్లను నిజం చేసింది.

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ రెండోసారి పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు బీటౌన్ వర్గాల సమాచారం. నటి సబా ఆజాద్‌తో కలిసి హృతిక్ ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించడంతో పాటు ఆమె మెడలో తాళి కూడా కట్టనున్నాడు. పైగా సబాను ఇంటికి సైతం తీసుకెళ్లాడు. హృతిక్ కుటుంబంతో కలిసి లంచ్ చేసిన సబా ఫొటోలు వైరల్ అయ్యాయి.
Also Read: రికార్డులన్నీ బద్దలైపోవాలి.. భీమ్లానాయక్ మీద బండ్ల గణేశ్ కామెంట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
ఈ నేపథ్యంలో హృతిక్, సబా త్వరలో ఒక ఇంటివారు కాబోతున్నారనే ప్రచారానికి బలం చేకూరింది. హృతిక్ రోషన్ ‘గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్’ అంటూ అభిమానులు పిలుస్తూ ఉంటారు. నిజంగా హృతిక్ జీవితం నమ్మశక్యం కానిది. హృతిక్ రోషన్ కి చిన్నతనంలో ఎక్కువగా నత్తి ఉండేది. ఆ నత్తి బాధతో అతను ఎన్నో ఇబ్బందులు, అవమానాలు పడ్డాడు.
పైగా అతనికి ఇంకా కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అయితే ఏం ? పుట్టుకతో వచ్చిన ఆ లోపాలను అణిచి, పట్టుదలతో తిరుగులేని ఆత్మవిశ్వాసంతో వెండితెర పై కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న నిజమైన హీరో హృతిక్ రోషన్. హీరో అయిన తొలిరోజుల్లో అసలు హృతిక్ ను హీరోగా భావించేవాళ్ళు కాదు.

అయితే, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు హృతిక్. మీకు తెలుసా ? హృతిక్ తొలి పారితోషికం కేవలం రూ.100. తన ఆరేళ్ల వయసులో 1980లో వచ్చిన ‘ఆశా’ అనే సినిమా కోసం తొలిసారి కెమెరా ముందుకొచ్చాడు. ముఖ్యంగా హృతిక్ తెర పై డ్యాన్స్ చేయడం చూస్తే… ‘అబ్బ…ఏం చేస్తన్నాడురా.. అసలు ఒంట్లో ఎముకలు ఉన్నాయా ? లేవా ? అని అందరూ ఆశ్చర్య పోతుండేవాళ్లు. ఇక హీరోగా అందరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా కూడా రికార్డు క్రియేట్ చేశాడు.
Also Read: భీమ్లానాయక్ పై జగన్ సర్కార్ నెగిటివ్ ప్రచారం