Homeఎంటర్టైన్మెంట్Jagan Sarkar Big shock to Bheemla Nayak: భీమ్లానాయ‌క్‌ను ముప్పు తిప్ప‌లు పెడుతున్న జ‌గ‌న్...

Jagan Sarkar Big shock to Bheemla Nayak: భీమ్లానాయ‌క్‌ను ముప్పు తిప్ప‌లు పెడుతున్న జ‌గ‌న్ స‌ర్కార్.. చాలా చోట్ల థియేట‌ర్లు క్లోజ్‌

Jagan Sarkar Big shock to Bheemla Nayak:  సినిమాకు రాజ‌కీయాల‌కు సంబంధం ల‌దేన్న‌ది పాత‌కాలం ముచ్చ‌ట‌. ఇప్పుడు ఏపీలో ప‌వ‌న్ క‌ల్యాన్ న‌టించిన భీమ్లా నాయ‌క్ వ‌ర్సెస్ జ‌గ‌న్ స‌ర్కార్ అన్న‌ట్టు రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. మొద‌టి నుంచి ఈ సినిమా మీద జ‌గ‌న్ ప్ర‌భుత్వం చాలా ఆంక్ష‌లు విధిస్తూనే ఉంది. టికెట్ల రేట్లు కూడా మూవీ రిలీజ్ అయ్యేదాకా పెంచొద్ద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ కావాల‌నే చేస్తోంద‌ని అంటున్నారు ప‌వ‌న్ ఫ్యాన్స్‌. ఇక పాత ప‌ద్ధ‌తిలోనే మూవీ రిలీజ్ అయింది.

Jagan Sarkar Big shock to Bheemla Nayak
Bheemla Nayak

అయితే ఈ మూవీకి జ‌గ‌న్ ప్ర‌భుత్వం పెట్టిన ఆంక్ష‌ల‌తో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మామూలుగా ప‌వ‌న్ మూవీ అంటేనే థియేట‌ర్లు ద‌ద్ద‌రిళ్లిపోతాయి. ఎక్క‌డ చూసినా హౌస్ ఫుల్ షోల‌తో టికెట్లు అన్నీ ముందే అమ్ముడుపోతాయి. కానీ ఏపీలోని చాలా చోట్ల సీన్ రివ‌ర్స్ అయిపోయింది. ఏపీలో ఈ మూవీకి బెనిఫిట్ షోలు లేవ‌ని ఇప్ప‌టికే రెవెన్యూ అధికారులు థియేట‌ర్ల ఓన‌ర్ల‌కు నోటీసులు ఇచ్చారు.

Also Read: భీమ్లానాయక్ పై జగన్ సర్కార్ నెగిటివ్ ప్రచారం

పైగా టికెట్ల రేట్లు కూడా పెంచొద్దంటూ నోటీసుల‌ను థియేట‌ర్ల ముందు అతికించారు. రూల్స్ ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. అంతే కాకుండా కొన్ని ఏరియాల్లో వీటిని ప‌ర్య‌వేక్షించేందుకు ప్ర‌త్యేకంగా అధికారులు రంగంలోకి దిగిన‌ట్టు తెలుస్తోంది. టికెట్ల రేట్లు త‌క్కువ‌గా ఉండ‌టంతో కృష్ణా జిల్లా మైలవరంలో ఈ మూవీని నిలిపేశారు. ఇక్క‌డ థియేట‌ర్ గేటు బ‌య‌ట మూవీ నిలిపేస్తున్న‌ట్టు నోటీసు అతికించారు. ఈ ధ‌ర‌ల‌కు తాము సినిమాను వేయ‌లేమ‌ని థియేటర్ క్లోజ్ చేశారు.

ఇక ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లులో కూడా భీమ్లా నాయక్ మూవీ ప్ర‌ద‌ర్శ‌న‌ను ఆపేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ ఏరియాల‌తో పాటు విజయనగరం, గుంటూరు, విజయవాడ లాంటి కీల‌క‌మైన ఏరియాల్లో బెనిఫిట్ షోలకు ప‌ర్మిష‌న్ లేక ప‌వ‌న్ ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. ఇక తెలంగాణలో బెన్ ఫిట్ షోలు ఉండ‌టంతో బార్డ‌ర్‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న ఏపీ ప్ర‌జ‌లు చాలామంది తెలంగాణ‌కు వ‌చ్చి ప‌వ‌న్ మూవీ చూస్తున్నారు.

Also Read:  రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లైపోవాలి.. భీమ్లానాయ‌క్ మీద బండ్ల గ‌ణేశ్ కామెంట్స్‌.. ఫ్యాన్స్‌కు పూన‌కాలే

 

Bheemla Nayak First Day Collections Report | Bheemla Nayak Public Talk | PawanKalyan, Rana Daggubati

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version