Pawan Kalyan Pan India Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చాయి. మరి ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు అతన్ని పవర్ స్టార్ గా నిలబెట్టాయి. ఇక ప్రస్తుతం ఆయన ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న ఆయన ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ప్రొడ్యూసర్ కి భారీ లాభాలను తీసుకొచ్చి పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని వేగవంతం చేయాలని చూస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై సినిమా మీద అంచనాలను మరోసారి పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కి మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం… మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ నార్త్ లో సైతం తన పాగా వేస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక చిన్న చిన్న హీరోలు సైతం పాన్ ఇండియా హీరోలుగా మారుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక మీదట ఆయన సినిమాలు చేస్తాడా?
లేదా అనే విషయం పక్కనపెడితే ఆయనకి పాన్ ఇండియా ఇమేజ్ వస్తే చాలా వరకు హెల్ప్ అవుతుందని ఇప్పటికే పొలిటికల్ గా ఆయన పాన్ ఇండియాలో కూడా సూపర్ సక్సెస్ ఫుల్ పొలిటిషన్ గా పేరు సంపాదించుకున్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి నాయకులు సైతం పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురిపించడంతో ఆయనకు ఎక్కడలేని క్రేజ్ అయితే వచ్చిందనేది వాస్తవం…
Also Read: తెలుగు విడుదలకు సిద్దమైన తమిళ లేటెస్ట్ బ్లాక్ బస్టర్..నిర్మాత ఎవరంటే!
మరి ఆ క్రేజ్ ను వాడుకుంటూ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సీనియా రిలీజైన రెండు నెలలకు సెప్టెంబర్ 25 వ తేదీన ఓజీ వస్తుంది. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ను సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమా మీద మూవీ యూనిట్ తో పాటు ప్రేక్షకులకు కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి…