MLC Kavitha: పునర్విభజన సమయంలో ఏపీలో కలిపిన 5 గ్రామాలు ఎటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చుకలపాడును తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. పోలవరం ముంపు పేరిట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను చీకటి ఆర్టినెన్స్ ద్వారా విలీనం చేసుకున్నారని ఆరోపించారు. ఫలితంగా లోయర్ సీలేరు పవర్ ఫ్లాంట్ ను లాగేసుకొని తెలంగాణలో కరెంట్ కష్టాలకు కారణం అయ్యారని విమర్శించారు.