https://oktelugu.com/

MLA Roja: మంత్రి పదవి కాదు కదా.. వచ్చే ఎన్నికల్లో రోజా ఎమ్మెల్యే కూడా కాదంట..?

MLA Roja: ఏపీ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రోజాకు ఎన్నికలు రాకముందే గడ్డుకాలం మొదలైనట్టు తెలుస్తోంది. నగరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రోజా ఏపీ కేబినెట్‌లో చోటు కోసం ఆశగా ఎదరుచూస్తోంది. వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే తనకు మంత్రి పదవి వస్తుందని రోజా గంపెడాశలు పెట్టుకుంది. కానీ అనుకోకుండా జగన్ రోజాకు షాక్ ఇచ్చారు. ఆమెకు మంత్రి పదవి ఇవ్వకుండా ఉత్త చేతులు చూపించారు. దీంతో రోజా అలిగి కొద్దిరోజులు కనిపించకుండా తిరిగింది. ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 14, 2021 / 02:48 PM IST
    Follow us on

    MLA Roja: ఏపీ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రోజాకు ఎన్నికలు రాకముందే గడ్డుకాలం మొదలైనట్టు తెలుస్తోంది. నగరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రోజా ఏపీ కేబినెట్‌లో చోటు కోసం ఆశగా ఎదరుచూస్తోంది. వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే తనకు మంత్రి పదవి వస్తుందని రోజా గంపెడాశలు పెట్టుకుంది. కానీ అనుకోకుండా జగన్ రోజాకు షాక్ ఇచ్చారు. ఆమెకు మంత్రి పదవి ఇవ్వకుండా ఉత్త చేతులు చూపించారు. దీంతో రోజా అలిగి కొద్దిరోజులు కనిపించకుండా తిరిగింది. ఈ విషయం తెలిసిన జగన్ నేరుగా రోజా వద్దకు వెళ్లి ఆమెను కన్విన్స్ చేశారు. చివరకు APIIC చైర్మన్ పదవి కట్టబెట్టారు. దీంతో రోజా శాంతించింది.

    MLA Roja

    కేబినెట్ విస్తరణలో చోటు కోసం..

    జగన్ సీఎం అయ్యాక పార్టీలో అందరికీ అవకాశం కల్పిస్తానని ప్రకటించారు. ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకున్న వారి పనిమీద రెండున్నరేళ్ల తర్వాత రివ్వ్యూ ఉంటుందని ముందే చెప్పారు. పనివిధానం బాగా లేని వారిని తప్పించి వారి స్థానంలో కొత్తవారికి చోటు కల్పిస్తామని చెప్పారు. దీంతో రోజా ఈసారి తనకు అవకాశం వస్తుందనే ఆశతో ఉన్నట్టు పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఒక్కసారి అయిన మంత్రి పదవిలో కొనసాగాలన్నది రోజా కలగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే, పరిస్థితులు మాత్రం ఆమెకు వ్యతిరేకంగా మారుతున్నాయి. సొంత నియోజకవర్గం నేతలే రోజాకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. మంత్రి పదవి కాదు కదా వచ్చే ఎన్నికల్లో ఆమెకు ఎమ్మెల్యే టిక్కెట్ కూడా దక్కకుండా చేసేందుకు ఏకంగా తీర్మానాలు కూడా చేసేసారని తెలిసింది.

    ఆ ఐదు మండలాల నేతలు..

    ఏపీ రాజకీయాల్లో రోజాను మించి ఫైర్ బ్రాండ్ లేరనేది కాదనలేని నిజం. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ, అధికారంలో ఉన్నప్పుడు గానీ రోజా మాటతీరులో ఏమాత్రం తేడా లేదు. టీడీపీ పార్టీ నేతలను, ఏకంగా చంద్రబాబును కూడా ఉతికారేస్తుంది. అయితే, రోజాకు రాజకీయంగా మంచి పేరున్న సొంతనియోజక వర్గంలో మాత్రం వ్యతిరేకత మొదలైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు మండలాల కీలక నేతలు రోజాకు వ్యతిరేకంగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అందులో ఇద్దరు రాష్ట్ర స్థాయిలో పలుకుబడి ఉన్న నేతలుగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వీరే రోజాను ముందుండి గెలిపించారు. ఈసారి మాత్రం గెలిపించేది లేదని తెగేసి చెబుతున్నారు. కారణం రోజా తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: RK Roja: హమ్మయ్య రోజా కు తప్పిన విమాన ప్రమాదం.. త్రుటిలో ఇలా..!

    మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో ఈ ఐదు మండలాలకు చెందిన కీలక నేతలు సూచించిన అభ్యర్థులను కాకుండా రోజా సొంత అభ్యర్థులన నిలబెట్టడమే వీరంతా ఆమెకు వ్యతిరేకంగా మారడానికి కారణంగా తెలుస్తోంది. రోజా సెలెక్ట్ చేసిన అభ్యర్థుల్లో కొందరు గెలువగా, మరికొందరు ఓడిపోయారు. నియోజకవర్గంలో తమను సంప్రదించకుండా రోజా ఒంటెద్దుపోకడలకు పోతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమెకు వ్యతిరేకంగా ఐదు మండలాల కీలకనేతలు ఏ చోట సమావేశమై రోజాకు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ రాకుండా హైకమాండ్ వద్ద చక్రం తిప్పాలని భావిస్తున్నారట.. ఒకవేళ టికెట్ వచ్చినా ఆమె ఓటమి కోసం పనిచేయాలని నిశ్చయించుకున్నట్టు తెలిసింది. చూడాలి మరి రోజా మంత్రి కల నేరువుతుందో లేదా ఉన్న పదవే ఊడుతుందో.. వెయిట్ అండ్ సీ..

    Also Read: PM Modi in Varanasi: కాశీలో కాలినడక.. ప్రధాని మోడీ అభివృద్ధి పైనే ప్రత్యేక దృష్టి

    Tags