Nithin script selections: ఆరంభం అదిరింది. ఇంకేముంది స్టార్ అయిపోతాడని అందరూ భావించారు. తీరా చూస్తే కనీసం టైరు టు హీరోల లిస్ట్ లో కూడా అట్టడుగుకు చేరిన పరిస్థితి. తన కంటే వెనకొచ్చిన నటులు, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకున్నా స్టార్ హీరోల రేసులో దూసుకుపోతున్నారు. నిజంగా నితిన్ కెరీర్ పరిశీలిస్తే ఎవరికైనా జాలి వేయకమానదు. నైజాం డిస్ట్రిబ్యూటర్ ఎన్. సుధాకర్ రెడ్డి కుమారుడైన నితిన్(NITIIN) ని దర్శకుడు తేజ జయం మూవీతో హీరోగా పరిచయం చేశాడు. అప్పటికే చిత్రం, నువ్వు నేను విజయాలతో దర్శకుడు తేజ మంచి ఊపు మీదున్నారు. ఆయన చిత్రాలతో యూత్ లో భారీ డిమాండ్ ఏర్పడింది.
తేజ నుండి వస్తున్న చిత్రం కావడంతో జయం మీద అంచనాలు పీక్స్ కి చేరాయి. అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా జయం బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. నితిన్, సదాలకు జనాల్లో కొంత గుర్తింపు వచ్చింది. రెండో చిత్రం దిల్ తో మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు నితిన్. ఈ సినిమా నితిన్ కి యూత్ లో ఫేమ్ తెచ్చిపెట్టింది. అనంతరం చేసిన సంబరం, శ్రీ ఆంజనేయం నిరాశపరిచాయి. అయితే రాజమౌళి సై తో కమ్ బ్యాక్ అయ్యాడు. ముచ్చటగా మూడో హిట్ కొట్టాడు. తర్వాత 7 ఏళ్ళు ఒక్క హిట్ పడలేదు. సినిమాలు మాత్రం పదికి పైగా చేశాడు.
Also Read: తమ్ముడు ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా..?
2012లో విడుదలైన ఇష్క్ రూపంలో నితిన్ కి హిట్ పడింది. నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నితిన్ కి భారీ ఉపశమనం ఇచ్చింది. ఆ నెక్స్ట్ మూవీ గుండెజారీ గల్లతయ్యిందే చిత్రంతో మరో హిట్ కొట్టాడు. తిరిగి కమ్ బ్యాక్ అయ్యాడు. స్టార్ హోదా దక్కుతుందనుకున్న తరుణంలో మళ్ళీ ప్లాప్స్. అ ఆ చిత్రంతో త్రివిక్రమ్ ఓ హిట్ ఇచ్చాడు. మళ్ళీ పరాజయాలు. 2021 భీష్మ రూపంలో మరో విజయం దక్కింది. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో నితిన్ 40 చిత్రాల వరకు చేశాడు. హిట్స్ మాత్రం ఐదారు కూడా లేవు.
నితిన్ కి విజయాలు ఎందుకు దక్కడం లేదు? అంటే కథల ఎంపిక తెలియక పోవడం ప్రధాన సమస్య అని చెప్పొచ్చు. పరిశ్రమలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. సక్సెస్ స్క్రిప్ట్ సెలక్షన్ పై ఆధారపడి ఉంటుంది. పెద్దగా బ్యాగ్రౌండ్ లేకున్నా స్టార్స్ గా ఎదిగిన నాని, విజయ్ దేవరకొండ అందుకు గొప్ప ఉదాహరణ. ముఖ్యంగా నాని స్క్రిప్ట్ సెలక్షన్ లో మేటి అనిపిస్తున్నాడు. అద్భుతమైన విజయాలు అందుకుంటున్నాడు.
Also Read: దిల్ రాజుకు ఏమైంది? ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోతున్న స్టార్ ప్రొడ్యూసర్!
పేపర్ మీద ఉన్న స్క్రిప్ట్ ని జడ్జి చేయడం అంత సులభం కాదు. దర్శకుడు చెప్పిన కథ స్క్రీన్ మీద ఎంత వరకు మెప్పిస్తుంది అనేది ముఖ్యం. అది అంచనా వేయగలగాలి. నితిన్ ఈ విషయంలో పూర్తిగా విఫలం అయ్యాడు. అదే సమయంలో అదృష్టం కూడా ఉండాలి. రీసెంట్ గా నితిన్ నటించిన రాబిన్ ఏమంత బ్యాడ్ మూవీ కాదు. కానీ డిజాస్టర్ అయ్యింది. ఓటీటీలో ఈ చిత్రానికి మంచి స్పందన దక్కింది. స్క్రిప్ట్ సెలక్షన్ పాటు లక్ కూడా నితిన్ దక్కడం లేదు. ఇకనైనా స్క్రిప్ట్ సెలక్షన్ లో నితిన్ జాగ్రత్త వహిస్తే విజయాలు దక్కే ఛాన్స్ ఉంది.