Mammootty Age: మలయాళ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటుడు మమ్ముట్టి (Mammootty)…ఆయనని హీరో అనడం కంటే గొప్ప నటుడు అంటేనే చాలా అందం గా ఉంటుంది. ఏ ఇండస్ట్రీ లో ఎవ్వరికీ సాధ్యం కానీ వైవిధ్యమైన పాత్రలను చేస్తూ ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వందల క్యారెక్టర్ లలో నటించి మెప్పించిన ఏకైక నటుడు మమ్ముట్టి…
15 రోజుల కిందట యాత్ర 2 (Yatra 2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రీసెంట్ గా ‘బ్రమయుగ ‘(Bramayugam) సినిమాతో మరోసారి ఆడియెన్స్ ను అలరించడానికి వచ్చి వాళ్ల మెప్పు పొందడమే కాకుండా తెలుగులో కూడా ఒక మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం మమ్ముట్టి వరుస సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక అందులో భాగంగానే ‘టర్బో ‘ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది. అసలు ఏ యంగ్ హీరోకి వీలుకానీ విధంగా నెలకు ఒక సినిమాని రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ 70 సంవత్సరాల వయసులో కూడా ఎక్కడ అలసిపోకుండా, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకొని వాటిని సక్సెస్ ఫుల్ గా పోషిస్తూ, యావత్ భారతదేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు…
ఇక టర్బో సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో బజుక, కడుగన్నావా ఒరు యాత్ర లాంటి మరో రెండు సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఆరు నెలల్లో దాదాపు నాలుగు సినిమాలను రిలీజ్ చేయాలని టార్గెట్ తో మమ్ముట్టి ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సంవత్సరం రెండు సినిమాలను రిలీజ్ చేశాడు. ఇక ఈ ఇయర్ ఎండింగ్ లోపు మరో 4 నుంచి 6 సినిమాలను రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. అలా చేస్తే ఇప్పుడున్న జనరేషన్ లో ఒక ఇయర్ లో ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసిన హీరోగా కూడా మమ్ముట్టి రికార్డ్ సృష్టిస్తాడనే చెప్పాలి. ఇక ఇపుడున్న యంగ్ హీరోలు గాని, సీనియర్ హీరోలు గాని ఎవరికి ఈ ఘనతని సాధించే అవకాశం అయితే లేదు…
ప్రతి ఒక్క హీరో ఒక సినిమా కోసం సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పైనే సమయాన్ని కేటాయిస్తుంటే, మమ్ముట్టి మాత్రం మంచినీళ్లు తాగినంత ఈజీగా నెలకు ఒక సినిమాని రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏజ్ లో కూడా ఆయన అంతలా కష్టపడుతున్నాడు అంటే ఆయన డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. మన తెలుగు హీరోలు కూడా ఆయన్ని ఫాలో అయితే మంచిది. అలా చేస్తే మంచి కాన్సెప్ట్ లతో చాలా తక్కువ రోజుల్లోనే ఎక్కువ సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సినిమా మీద ఆధారపడి బతుకుతున్న చాలామందికి ఎక్కువ రోజులు పని దొరుకుతుంది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More