https://oktelugu.com/

Kanguva movie: కంగువ సినిమా కోసం సూర్య ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తేలిస్తే షాక్ అవుతారు..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన సూర్య కూడా వైవిధ్యమైన సినిమాలను చేయడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు...

Written By:
  • Gopi
  • , Updated On : May 1, 2024 / 05:30 PM IST

    How much remuneration Surya took for Kanguva movie

    Follow us on

    Kanguva movie: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలు వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తూ సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. అయితే వాళ్ళు చేసే ప్రయోగత్మకమైన సినిమాలు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఎలా చేయాలి అనేది వాళ్ళకి తెలిసినంత గొప్పగా మరేవరికి తెలియదు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన సూర్య కూడా వైవిధ్యమైన సినిమాలను చేయడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు…

    గజిని, సెవెంత్ సెన్స్ లాంటి సినిమాలతో డిఫరెంట్ అటెంప్ట్ లను ట్రై చేసిన సూర్య ఇప్పుడు కంగువ సినిమాతో మరోసారి ప్రయోగాత్మకమైన కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశ్యం తో తను ఈ సినిమా కోసం భారీ ఎఫర్ట్ పెట్టి కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా కోసం సూర్య దాదాపు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఈ సినిమా కనక సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తే పాన్ ఇండియా లెవెల్లో సూర్య స్టార్ హీరోగా గుర్తింపు పొందుతాడు. రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా మీదనే ప్రస్తుతం సూర్య భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. మరి దానికి అనుగుణంగానే సక్సెస్ సాధించి పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తీసుకొస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…

    ఇక మొత్తానికైతే సూర్య ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం ఈ సినిమా మీదనే పెట్టాడు ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ బ్యాలెన్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసే పనిలో సినిమా యూనిట్ లీనమైపోయి వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…